సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జయం’లో ఛాన్స్.. పార్టీ చేసుకున్న బన్నీ.. తీరా చూస్తే!

ABN, Publish Date - Jul 24 , 2026 | 06:35 PM

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని విజయాన్ని సాధించి, అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. అయితే ఆయన సినీ ప్రయాణం అంత సులభంగా ఏమీ ప్రారంభం కాలేదు.

Allu Arjun and Chinni Krishna

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని విజయాన్ని సాధించి, అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. అయితే ఆయన సినీ ప్రయాణం అంత సులభంగా ఏమీ ప్రారంభం కాలేదు. కెరీర్ ప్రారంభంలో ఆయన కూడా తీవ్ర ప్రతికూలతలను, చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని ప్రముఖ రచయిత చిన్నికృష్ణ (Chinni Krishna) తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అల్లు అర్జున్ సినీ అరంగేట్రం వెనుక ఉన్న నాటకీయ పరిణామాలను, తేజ ‘జయం’ (Jayam) చిత్రం నుంచి ఆయనను తొలగించిన నాటి సంఘటనలను చిన్నికృష్ణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.


రచయిత చిన్నికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ప్రముఖ దర్శకుడు తేజ (Director Teja) దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ చిత్రంలో కథానాయకుడిగా మొదట అల్లు అర్జున్‌నే ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ ఖరారైన సంతోషంలో చిత్రబృందం, కాస్టింగ్ మెంబర్స్ అందరూ కలిసి గ్రాండ్‌గా పార్టీ కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా, ఆ మరుసటి రోజు పత్రికల్లో అల్లు అర్జున్ స్థానంలో వేరొకరిని (నితిన్) హీరోగా తీసుకున్నట్లు ప్రకటన వెలువడింది. అంత పెద్ద సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాత కుమారుడికి అలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని చిన్నికృష్ణ పేర్కొన్నారు.


‘జయం’ సినిమా అవకాశం చేజారడంతో నిరాశ చెందకుండా, అల్లు అర్జున్‌ను సరైన రీతిలో పరిచయం చేయడానికి చిన్నికృష్ణ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. ఆ సమయంలో రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకుడి ప్రాజెక్ట్‌పై పనిచేసే స్థాయిలో ఉన్న చిన్నికృష్ణ, తన దృష్టిని మళ్ళించి ‘గంగోత్రి’ (Gangothri) చిత్రానికి కథనందించేందుకు సిద్ధమయ్యారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘గంగోత్రి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే నటుడిగా నిరూపించుకున్న అల్లు అర్జున్, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. ఇటీవల వచ్చిన ‘పుష్ప’తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

నాని కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్.. ఇలా అయిందేంటి

త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...

‘జ‌న‌ నాయ‌గ‌న్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?

Updated Date - Jul 24 , 2026 | 06:35 PM