నాని కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్.. ఇలా అయిందేంటి
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:05 PM
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం కలెక్షన్ల పరంగా, క్రేజ్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వైవిధ్యమైన సినిమాలతో థియేటర్ల దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ప్రస్తుతం కలెక్షన్ల పరంగా, క్రేజ్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వైవిధ్యమైన సినిమాలతో థియేటర్ల దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ‘దసరా’ (Dasara) వంటి మాస్ కమర్షియల్ హిట్‌తో తన కెరీర్‌లోనే తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన నాని, ఇప్పుడు అంతకుమించిన భారీ టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు. ‘దసరా’ అందించిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలోనే తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లోనే కాకుండా, ఫస్ట్ టైమ్ ఫ్రెంచ్ భాషలో కూడా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అయినా సరిగ్గా టైమ్‌కి రాకపోతే ఆ బజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఈ సినిమాకు అసలైన పెద్ద సమస్య రిలీజ్ డేట్.
సాధారణంగా నాని ఒక సినిమా ఒప్పుకొని, డేట్ లాక్ చేశాడంటే చెప్పిన సమయానికే థియేటర్లలోకి తెస్తుంటారు. ప్లానింగ్ విషయంలో నాని చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటాడని ట్రేడ్ వర్గాల్లో పేరుంది. కానీ, ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం సీన్ తలకిందులైంది..! ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా అసలు ఎప్పుడు వస్తుందో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమా రిలీజ్ లేట్ అవడానికి కారణాలు ఏంటా అని వెతికితే.. ఇంకా చాలా భాగం షూటింగ్ పెండింగ్‌లోనే ఉందట. అంతటితో ఆగకుండా, భారీ విజువల్స్ ఉన్న ప్రాజెక్ట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా సమయం పడుతోందని సమాచారం. ఈ క్రమంలోనే సెప్టెంబర్ లేదా డిసెంబర్ వరకు కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని ఫిలింనగర్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి సీన్‌ను ఒక విజువల్ వండర్‌లా మార్చాలనే ఉద్దేశంతో చాలా సమయం తీసుకుని చెక్కుతున్నాడట. పర్‌ఫెక్ట్ అవుట్‌పుట్ రావాలంటే ఈ మాత్రం టైమ్ తప్పదు అనే మూడ్‌లో చిత్రబృందం ఉంది. ఒక్కటి మాత్రం నిజం.. ఇన్నిసార్లు వాయిదా పడితే, ఆడియన్స్‌లో ఉండే క్యూరియాసిటీ కొంచెం తగ్గే ప్రమాదం ఉంటుంది. మరి నాని ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా స్కేల్ విషయానికి వస్తే.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి బిజిఎమ్, మ్యూజిక్ అందిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఊహించని సరికొత్త కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అపరిమితమైన బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అతి పెద్ద ప్లానింగ్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో.. నాని తన పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమాను అనుకున్న సమయానికి ఎలా తెస్తాడో వేచి చూడాల్సిందే..!
ఇవి కూడా చదవండి:
త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...
‘జన నాయగన్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?
రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?