Allu Arjun: ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ దీపావళి సెలబ్రేషన్స్..
ABN, Publish Date - Nov 09 , 2026 | 08:04 AM
సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు.
సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పండుగ సందర్భంగా కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్రాకర్స్ కాలుస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియోతో పాటు తన పిల్లలు అయాన్, అర్హాతో సరదాగా గడిపిన క్యూట్ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాయి. పండుగ వేళ భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతూ ఆ మధుర క్షణాలను అభిమానులతో పంచుకోవడం, ముఖ్యంగా అయాన్, అర్హాతో ఆయన సరదాగా గడిపిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
అంతే కాదు పండుగ రోజు ఆయన్ని చూడటానికి ఇంటి ముందుకొచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంట కూడా దీపావళి వేడుకలను ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ఈ జంట అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌లో గందరగోళం
ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..