నానికే ఈ రేంజ్ లో ఉంటే.. దేవరకొండ పరిస్థితి ఏంటో
ABN, Publish Date - Sep 26 , 2026 | 12:36 PM
న్యాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నెగెటివ్ ట్రోల్స్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నెగెటివ్ ట్రోల్స్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్యారడైజ్ ఫలితం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి (Ranabali) చిత్రంపై పడింది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. పైగా రష్మిక మందన్నతో వివాహం తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు మరియు అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
టాక్సీవాలా వంటి సూపర్‌హిట్ తరువాత విజయ్ దేవరకొండ - దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో రణబాలిపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయి. అయితే అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్యారడైజ్ ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఒకవేళ ఏమాత్రం తేడా కొట్టి రణబాలికి కూడా మిశ్రమ స్పందన వస్తే, నానికంటే ఎక్కువ స్థాయిలో విజయ్ దేవరకొండ ట్రోలింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందనే చర్చ నెట్టింట సాగుతోంది.
అయితే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌కు కథ, కథనాలపై ప్రత్యేకమైన పట్టు ఉంది. ఆయన గతంలో తీసిన టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలే దీనికి నిదర్శనం. వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడంలో రాహుల్ ముందే ఉంటాడు. టీజర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన చూస్తుంటే, కథనం విషయంలో రాహుల్ మరోసారి మేజిక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్యారడైజ్ ఇచ్చిన షాక్ నుంచి టాలీవుడ్ కోలుకోవాలంటే రణబాలి హిట్ కొట్టడం చాలా అవసరంగా మారింది. పెళ్లి తర్వాత రష్మిక లక్కీ హ్యాండ్, రాహుల్ సాంకృత్యన్ విజన్, విజయ్ దేవరకొండ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కలిసి రణబాలిని ఎలాంటి విజయ తీరాలకు చేరుస్తాయో చూడాలి. మాస్ హీరో ఇమేజ్ కోసం విజయ్ కూడా నానిలా రక్తపాతాన్ని మాత్రమే ఎంచుకున్నాడా.. లేక కథతో మెప్పిస్తాడా అనేది చూడాలి.
Also Read:
బాస్ తొక్కేసాడా.. ఏమైనా కౌంటరా.. అదిరా మెగాస్టార్ అంటే
The Paradise: అక్కడ మెగాస్టార్ వెనుకే నాని!
Anjali: తొలి సినిమా దర్శకుడితో 20 ఏళ్ల తర్వాత మళ్లీ.