10 డేస్ ‘లెనిన్’ కలెక్షన్స్.. సెంచరీ కష్టమేనా
ABN, Publish Date - Jul 20 , 2026 | 04:51 PM
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ 10 డేస్ కలెక్షన్స్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin Movie) థియేటర్లలో సందడి చేస్తోంది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం మొదటి వారం నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. రీసెంట్‌గా ఈ సినిమా 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా నిర్మాతలు అధికారికంగా తెలుపుతూ.. పోస్టర్‌ను విడుదల చేశారు.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ విలేజ్ డ్రామాలో అఖిల్ ఊరమాస్ అవతార్, ఎస్.ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి వీకెండ్‌లోనే భారీ నంబర్లను నమోదు చేసిన ‘లెనిన్’.. బాక్సాఫీస్ వద్ద ‘మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు’ అనే టాక్‌తో మంచి హోల్డ్ సాధించింది. 10 రోజుల్లో రూ. 88 కోట్లు రాబట్టి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ‘లెనిన్’ నిలిచింది. అయితే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ‘లెనిన్’ సెంచరీ (రూ. 100 కోట్లు) కొడతాడా లేదా? అనే చర్చ నడుస్తోంది.
నిర్మాత నాగవంశీ ఆశించినట్లుగా సినిమా 100 కోట్ల మైలురాయికి చేరువలోనే ఉంది. మరో రూ. 12 కోట్లు రాబడితే ఈ మైలురాయిని అందుకోవడం ఖాయం. కాకపోతే, రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో, వర్కింగ్ డేస్‌లో హోల్డ్ ఎలా ఉంటుందనే దానిపైనే ఈ ‘సెంచరీ’ ఆధారపడి ఉంది. ఏదేమైనా అఖిల్ ఖాతాలో ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ విజయం పడటంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శివాజీ ఓ కీలక పాత్రను పోషించారు.
ఇవి కూడా చదవండి:
ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్
మెగా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటున్నా: నిహారిక
చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం