సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tirumala: తిరుమ‌లేశుడిని.. ద‌ర్శించుకున్న శ్రీవిష్ణు

ABN, Publish Date - Oct 15 , 2026 | 06:17 PM

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu) గురువారం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన, విఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన కామ్రేడ్ క‌ళ్యాణ్ (Comrade Kalyan) థియేట‌ర్ల‌కు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ స్వామి వారిని ద‌ర్శించుకుంది.

దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీవిష్ణుకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనను స్వామివారి వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న వారిలో ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ (Kona Venkat), చిత్ర ద‌ర్శ‌కుడు జాన‌కి రామ్ ఉన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 06:24 PM