సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?

ABN, Publish Date - Oct 24 , 2026 | 09:33 AM

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ వేడుకలో త్రివిక్రమ్ స్పీచ్ వైరల్ అవుతోంది.

Trivikram Srinivas

విక్టరీ వెంకటేష్ (Victor Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (Aadarsha Kutumbam – House No. 47). దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో టాలీవుడ్‌లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ‘నారాయణమ్మ’, ‘మాలా’ పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు సినిమాపై మరింత హైప్‌ను, ఆసక్తిని పెంచేశాయి. సాధారణంగా త్రివిక్రమ్-వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా, క్లీన్ కామెడీ ఉంటాయని అంతా ఊహిస్తారు. కానీ గురూజీ ఈసారి రూట్ పూర్తిగా మార్చేశానని స్పష్టం చేశారు.


ట్రైలర్ లాంఛ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా అంతా ఊహించిన పద్ధతిలో ఉండదు.. పూర్తిగా వేరే డైరెక్షన్‌లో సాగే అవకాశం ఉన్న కథ ఇది. నార్మల్ రొమాంటిక్ కామెడీ కాకుండా వేరే వేరే సామాజిక అంశాలను కూడా ఇందులో చర్చించాం. దీన్ని ఒక రకమైన క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ తరహాలో సరికొత్తగా ప్రయత్నించాం. నాకు, వెంకటేష్ గారికి ఇద్దరికీ కూడా ఇది కెరీర్‌లోనే మొదటి ప్రయత్నం (ఫస్ట్ అటెంప్ట్). చిత్రీకరణ చేస్తున్నంతసేపు మా అందరికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రేక్షకులకూ తప్పకుండా సరికొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని వెల్లడించారు.

సభలో ఉన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను బయట ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం.. నేను చెప్పాలనుకున్న మాటలన్నీ సినిమాల్లో రాస్తూనే ఉంటా, అందుకే మిమ్మల్ని ఎక్కువగా విసిగించకూడదని అనుకుంటాను. నేను కూడా చదువుకునే రోజుల్లో సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్‌నే. మీరు చదివే చదువులో ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు బాగా తెలుసు. అటువంటి బిజీ లైఫ్‌లో ఈ ఫంక్షన్ మీకు ఒక చిన్న ఆటవిడుపు లాగా, రెండు మూడు రోజులకు సరిపడా మంచి జ్ఞాపకాలను మిగిల్చితే ఎంతో ఆనందిస్తాను’’ అని చమత్కరించారు.


సంగీత దర్శకుడు తమన్ వర్క్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తమన్ ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు. దాదాపు 7 నుంచి 8 పాటల బిట్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనే వస్తాయి. వాటన్నింటినీ కూడా అతి త్వరలోనే ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. నిర్మాత చినబాబుకు కృతజ్ఞతలు చెప్పడం అంటే సొంత ఫ్యామిలీకి చెప్పుకోవడమేనంటూ, ఆయన తరపున తానే నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తంగా త్రివిక్రమ్ చెప్పినట్లు ఈసారి ‘ఆదర్శ కుటుంబం’ కేవలం కుటుంబ కథా చిత్రంగానే కాకుండా, క్రైమ్ అండ్ డార్క్ కామెడీ అంశాలతో వెండితెరపై సరికొత్త ట్రీట్ ఇవ్వబోతోందని స్పష్టమైంది. ఈ చిత్రం అక్టోబర్ 30న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

Sunday TV Movies: అక్టోబ‌ర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు

‘వారణాసి’ తర్వాత జక్కన్న మనకు కనబడరా..

సీమ గడ్డపై రౌడీ హీరో భావోద్వేగం.. ‘రణబాలి’ రణభేరిలో స్పీచ్ అదిరింది

Updated Date - Oct 24 , 2026 | 09:33 AM