సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thalapathy Vijay: శుభాకాంక్ష‌లు తెలిపిన చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్ బాబు

ABN, Publish Date - May 04 , 2026 | 04:05 PM

దళపతి విజయ్‌ ఊహించని విజయాన్ని తమిళ నాట అందుకున్నారు. దాంతో తెలుగు సినీ ప్రముఖులు పలువురు తోటి నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు.

Thalapathy Vijay

తమిళనాడు రాజకీయాలలో దళపతి విజయ్‌ (Vijay) అనూహ్య విజయాన్ని దక్కించుకోబోతున్నాడు. అభిమానులు తనకిచ్చిన దళపతి అనే బిరుదుకు సార్థకత చేకూర్చుతు... ఇవాళ నిజంగానే దళపతిగా నిలిచాడు. రెండేళ్ళ క్రితం తాను పెట్టిన 'తమిళక వెట్రి కళగం' (TVK) పార్టీని ఒంటి చేతితో గెలిపించి, తన సత్తాను చాటుకున్నాడు. ఒకే ఒక్కటి తప్ప మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ విజయ్‌ ఓడిపోతాడనే చెప్పాయి. అనేక సంస్థలు విజయ్‌ పాతికలోపు స్థానాలే గెలుచుకుంటాడని జోస్యం చెప్పాయి. అయితే వాటిని తిరగరాసి విజయ్‌ సెంచరీని దాటేస్తున్నాడు. మ్యాజిక్‌ మార్క్‌ను అందుకోవడానికి కొన్ని సీట్లు మాత్రమే తగ్గుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడని సన్నిహితులు అంటున్నారు.


ఎన్నికల సమయంలో డీ.ఎం.కే.తో బాహాబాహీకి దిగిన విజయ్‌ అన్నా డీఎంకే పైనా ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు. వారి ఆలోచన విధానంతో తనకు సరిపడదని మాత్రం స్పష్టం చేశాడు. ఇప్పుడు తుది ఫలితాలు వచ్చిన తర్వాత సైతం విజయ్‌ అభిప్రాయాలో మార్పు ఉండదని సన్నిహితులు చెబుతున్నారు. తన ఐడియాలజీని సమర్థించే చిన్న పార్టీలతో విజయ్‌ చేతులు కలుపుతాడని, వారి సాయంతో పూర్తి స్థాయిలో మెజారిటీని పొంది, అధికారాన్ని చేపడతాడని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో విజయ్‌ పొత్తు పెట్టుకోడని వార్తలు వస్తున్నాయి.


ఇదిలా ఉంటే... విజయ్‌ పార్టీ ఊహించని విజయాన్ని అందుకోవడంతో తెలుగు, తమిళ సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు అతన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. తమిళ స్టార్స్ సూర్య ఒక్క‌డు మిన‌హా మిగ‌తా వారు కాస్తంత మౌనం పాటిస్తున్నా... తెలుగువారైన మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, నాని, రవితేజ, శర్వానంద్‌, నిఖిల్‌, సాయి దుర్గాతేజ్‌, రామ్ పోలినేని, సందీప్‌ కిషన్‌, మంచు మనోజ్, డా. రాజశేఖర్ వంటి వారు విజయ్‌ ను ఎక్స్ వేదికగా అభినందించారు.

మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన, సముచితమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు.. నిరంత‌రం ఇలానే నిరంతరం ప్రేరణనిస్తూ, దృఢమైన సంకల్పంతో నాయకత్వం వహిస్తూ, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. తమిళనాడు రాష్ట్రం, అక్కడి ప్రజలకు మీరు అందించే ప్రజాసేవలో విజయవంతం కావాలని నా శుభాకాంక్షలు. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

Updated Date - May 04 , 2026 | 07:06 PM