విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’.. క్రైమ్ యాక్షన్‌లో నెవర్ బిఫోర్ స్క్రీన్‌ప్లే!
ABN, Publish Date - Sep 21 , 2026 | 09:09 AM
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘ఆన్ డ్యూటీ’
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర (Vijay Raghavendra) కథానాయకుడిగా దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న (Sanjeev Megoti) కొత్త చిత్రం ‘ఆన్ డ్యూటీ’ (On duty). ‘పోలీస్ కంప్లైంట్’ తర్వాత సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రైమ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. సరికొత్త కథాంశం, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన క్రైమ్, యాక్షన్ కథలకు భిన్నంగా ‘ఆన్ డ్యూటీ’ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. కథలోని ప్రధాన అంశాలను ఆసక్తికరంగా మలచడంతో పాటు, స్క్రీన్‌ప్లేలోనూ కొత్తదనం ఉండేలా దర్శకుడు సంజీవ్ మేగోటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. కథకు సంబంధించిన కీలక అంశాలను గోప్యంగా ఉంచుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
“భారీ స్థాయిలో విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన కథలకు భిన్నంగా, నెవర్ బిఫోర్ అనే రీతిలో ఈ చిత్రం ఉంటుంది. క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కథను చూపించబోతున్నాం” అని మేకర్స్ తెలిపారు. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం ‘ఆన్ డ్యూటీ’కి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
ALSO READ:
రూ.కోటి కూడా రాలేదట! మమ్ముట్టి గెస్ట్ రోల్ చేసినా.. ప్రయోజనం లేకుండా పోయిందే!
Tuesday Tv Movies: సెప్టెంబర్ 22, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది
Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!