సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 09 , 2026 | 05:45 PM
భారత క్రికెటర్ సంజూ శాంసన్ పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా జరిగిన టీ20 వరల్డ్ కప్ భారత్ వశం కావడంలో సంజూ పాత్ర ఎంత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సంజూపై దర్శకుడు విఘ్నేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson)పై దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా జరిగిన టీ20 వరల్డ్ కప్ భారత్ వశం కావడంలో సంజూ పాత్ర ఎంత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అసలు అవకాశం వస్తుందా? లేదా? అనే పరిస్థితి నుంచి.. వరల్డ్ కప్ గెలిపించే వరకు సంజూ శాంసన్ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడంలో సందేహమే అవసరం లేదు. తనకు వచ్చిన అవకాశాన్ని సంజూ చాలా చక్కగా వినియోగించుకుని, తన సత్తా ఇదని చాటి చెప్పాడు. ఇకపై తనని తుది జట్టులో లేకుండా చేయడానికి అస్కారం లేకుండా, అత్యద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. అలాంటి సంజూపై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే..
సంజూ శాంసన్‌లో నాకు లైఫ్ పై హోప్ కలిగించే వ్యక్తి కనిపిస్తున్నాడని అన్నారు విఘ్నేష్ శివన్. భారత జట్టులో స్థానం కోసం సంజూ చేసిన కృషి అమోఘమని ఆయన అన్నారు. దీని కోసం సంజూ చేసిన పోరాటం, ఎదుర్కొన్న విమర్శలు చాలానే ఉన్నాయని, అయినా కూడా స్ట్రాంగ్‌గా నిలబడటం చాలా గొప్ప విషయమని విఘ్నేష్ అభినందనలు కురిపించారు. ప్రతిభ ఉండి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎందరికో సంజూ శాంసన్ స్ఫూర్తిగా నిలిచాడని, అంత కష్ట సమయంలో కూడా చాలా ధైర్యంగా పోరాటం చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని విఘ్నేష్ చెప్పుకొచ్చారు. అందుకే లైఫ్ పై హోప్ కలిగించిన వ్యక్తిగా తనని చూస్తానని విఘ్నేష్ శివన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany) చిత్ర ప్రమోషన్స్‌లో సంజూ ప్రస్తావన రాగా, విఘ్నేష్ ఇలా రియాక్ట్ అయ్యారు.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విషయానికి వస్తే.. వరుస బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లతో దూసుకెళుతోన్న కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార (Nayanthara) నిర్మించగా, బేబమ్మ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించారు. ఎస్.జె. సూర్య, యోగి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి:
సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా
ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్
స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు
అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. ‘లెనిన్’ న్యూ పోస్టర్ విడుదల