Vignesh Shivan: నయనతార భర్తకు ఎల్‌ఐసీ నోటీసు.. కారణమిదే!

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:11 PM

అగ్రనటి నటి నయనతార భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌కు భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా విఘ్నేష్‌ శివన్‌ ‘‘ఎల్‌ఐసి’’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) అనే టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించగా.. అది కాస్తా వివాదంగా మారింది.

Vignesh Shivan: నయనతార భర్తకు ఎల్‌ఐసీ నోటీసు.. కారణమిదే!
Nayanthara and Vignesh

అగ్రనటి నటి నయనతార (Nayanthara) భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan)కు భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, విఘ్నేష్ శివన్‌కు ఎల్‌ఐసీ నోటీసులు జారీ చేయడం వెనుక ఓ కారణం ఉంది. బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘లవ్‌టుడే’ ఫేం ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా విఘ్నేష్‌ శివన్‌ ‘‘ఎల్‌ఐసి’’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) అనే టైటిల్‌తో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే, ఈ టైటిల్‌పై ఆది నుంచి వివాదం నెలకొంది.

ఈ టైటిల్‌ తమకు సొంతమైనదని దర్శకుడు ఎస్‌ఎస్‌ కుమార్‌ ఇప్పటికే ప్రకటించి, నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లారు. ఇపుడు భారత జీవిత బీమా సంస్థ కూడా ఈ టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఎల్‌ఐసి’ అనేది తమ సంస్థకు రిజిస్టర్‌ చేసిన పేరని, ఈ పేరును ఇతరులు ఉపయోగించడం చట్ట వ్యతిరేకమంటూ దర్శక, నిర్మాతలకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుకు 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో నిర్మాణ సంస్థ ప్రత్యామ్నాయ టైటిల్‌ కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. (LIC Controversy)


LIC.jpg

2022లో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కాంబినేషన్‌లో విఘ్నేష్ శివన్ ‘కథువాకుల రెండు కాదల్’ అనే సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆయన ఏ సినిమాను డైరెక్ట్ చేయలేదు. కాస్త గ్యాప్ తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌తో ‘‘ఎల్‌ఐసి’’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా టైటిల్ కాస్త వివాదంగా మారింది. ప్రస్తుతం ఈ టైటిల్‌ని మార్చి.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో విఘ్నేష్ శివన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*నన్ను క్షమించు స్వామీ... కెప్టెన్‌ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం

***************************

*Guntur Kaaram: ‘మావ ఎంతైనా’.. లిరికల్ సాంగ్

***************************

*Vijay Sethupathi: హిందీ నేర్చుకోవద్దని ఎవరూ చెప్పలేదు

*******************************

Updated Date - Jan 10 , 2024 | 02:11 PM