Vignesh Shivan: ఆ సినిమా మా బ్యానర్‌కు దక్కిన సముచిత గౌరవం

ABN , First Publish Date - 2023-10-30T14:48:53+05:30 IST

తమ సొంత బ్యానర్‌ రౌడీ పిక్చర్స్‌కు ‘కూళంగల్‌’ చిత్రం సముచిత గౌరవ మర్యాదలు దక్కేలా చేసిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ అన్నారు. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ దర్శకత్వంలో యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 27వ తేదీ నుంచి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Vignesh Shivan: ఆ సినిమా మా బ్యానర్‌కు దక్కిన సముచిత గౌరవం
Koozhangal Movie Team

తమ సొంత బ్యానర్‌ రౌడీ పిక్చర్స్‌కు ‘కూళంగల్‌’ (Koozhangal) చిత్రం సముచిత గౌరవ మర్యాదలు దక్కేలా చేసిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ అన్నారు. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ దర్శకత్వంలో యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 27వ తేదీ నుంచి సోనీ లైవ్‌ (SonyLiv)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీన్ని పురస్కరించుకుని చిత్ర బృందం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఇందులో నిర్మాత విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan) మాట్లాడుతూ.. తమ సొంత బ్యానర్‌ రౌడీ పిక్చర్స్‌పై నిర్మించాలని భావించిన తొలి చిత్రం ‘కూళంగల్‌’. ఈ సినిమా మా బ్యానర్‌కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కూడా మాకు ఎంతగానో నచ్చింది. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలు అవార్డులు, రివార్డులను కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించే సమయంలో ఆయా దేశాల ప్రేక్షకులకు కూడా నచ్చింది. మా బ్యానరుపై నిర్మించిన తొలి చిత్రానికే అనేక అవార్డులు రావడం ఆనందంగా ఉంది. అలాగే, అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన తర్వాతే విడుదల చేయాలని ఆరంభంలోనే నిర్ణయం తీసుకున్నాం. అనేక మంది సినీ దర్శకులు, నటీనటులను ఈ చిత్రం మాకు పరిచయం చేసింది. ఇలాంటి అవకాశం కల్పించిన దర్శకుడు వినోద్‌ రాజ్‌కు ధన్యవాదాలని అన్నారు.


Nayan.jpg

చిత్ర దర్శకుడు వినోద్‌ రాజ్‌ (PS Vinothraj) మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని నయనతార (Nayanthara), విఘ్నేష్‌ శివన్‌ చూసి అభినందించం చాలా సంతోషం కలిగించింది. వారిద్దరికీ ఈ సినిమా నచ్చడంతో.. నాకు సినిమాపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం నిజం చేస్తూ.. ఈ సినిమా అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడటం, మంచి పేరు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నా మీద నమ్మకం ఉంచిన నిర్మాతలకు, సినిమాను ఆదరించిన అన్ని దేశాల ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

========================

*Vijay Deverakonda: మా అందరినీ కలిపింది సినిమానే..

**********************************

*MLC Kavitha: మెగాస్టార్ చిరంజీవి తర్వాత కవితకు ఏ హీరో ఇష్టమంటే..

***********************************

*Satyam Rajesh: సత్యం రాజేష్ టైమ్ నడుస్తోంది

***********************************

Updated Date - 2023-10-30T14:49:10+05:30 IST