సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mime Gopi: ప్రయోగాత్మక చిత్రంతో హీరోగా 

ABN, Publish Date - Aug 01 , 2026 | 10:11 AM

దక్షిణాది సినిమాలో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తమిళ నటుడు మైమ్‌ గోపి హీరోగా పరిచయంకానున్నారు.  

దక్షిణాది సినిమాలో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తమిళ నటుడు మైమ్‌ గోపి(mime Gopi) హీరోగా పరిచయంకానున్నారు. తమిళ, తెలుగు, మలయాళ  చిత్రాల్లో పలు కీలకమైన పాత్రలు పోషిస్తున్న ఆయన  విభిన్నమైన నటనతో ఆకట్టుకుంటూ..అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువర్‌పేకర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై రూపొందే చిత్రంలో ఆయన హీరోగా నటించనున్నారు. యువర్‌ పేకర్స్‌ ద్వారా ఓటీటీ ఫ్లాట్‌ఫాం కోసం అనేక లఘు చిత్రాలను నిర్మించిన సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కిశోర్ ఆదిత్య నిర్మాత.

ప్రస్తుతం  హీరోయిన్‌, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.  వైవిధ్య‌భరిత కథ, కథనాలు ముఖ్యంగా మహిళల రక్షణ, దానికి సంబంధించిన అవగాహన వంటి అంశాలతో ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత కిషోర్‌ ఆదిత్య చెప్పారు.  ‘థ్రిల్లర్‌, ఉత్కంఠభరితమైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నాం. అభిమానులకు బాగా కనెక్ట్‌ అవుతుంది.  ఊటి, కొడైక్కెనాల్‌ తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగు ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే టైటిల్‌, ఇతర నటీనటుల గురించి తెలియజేస్తాం' అని నిర్మాత తెలిపారు. 

ALSO READ:
Raashii Khanna: తలైవర్ నుంచి రాశీ ఖన్నాకు ప్రత్యేక గిఫ్ట్

Om: ధనుష్ 'ఓం' మూవీ కథ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Srinivasa Mangapuram: నిన్న సినిమా రిలీజ్.. నేడు వీడియో సాంగ్ రిలీజ్



Updated Date - Aug 01 , 2026 | 10:31 AM