Raashii Khanna: తలైవర్ నుంచి రాశీ ఖన్నాకు ప్రత్యేక గిఫ్ట్

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:57 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి హీరోయిన్‌ రాశీ ఖన్నాకు ఓ ప్రత్యేక బహుమతి అందింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి హీరోయిన్‌ రాశీ ఖన్నాకు ఓ ప్రత్యేక బహుమతి అందింది. ప్రస్తుతం యువ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్‌’ చిత్రంలో రజనీకాంత్‌, సిమ్రన్‌, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా షూటింగ్‌లో ఓ మధురమైన సంఘటనను రాశీ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో అభిమానులతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ధర్మన్‌’ షూటింగ్‌ సమయంలో రజనికాంత్ గారితో  ఆధ్యాత్మికత చర్చ  జరిగింది.  ‘లివింగ్‌ విత్‌ ది హిమాలయన్‌ మాస్టర్స్‌’ అనే పుస్తకం చదివావా అని నన్ను అడిగారు.  ఇంకా ఆ పుస్తకం చదవలేదని చెప్పడంతో, రెండు రోజుల తర్వాత స్వయంగా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా 'ఈ పుస్తకం చదివాక నువ్వే నన్ను ప్రశ్నలు అడుగుతావు' అని ఆయన అన్నారు.  

 

Updated Date - Aug 01 , 2026 | 09:27 AM