Srinivasa Mangapuram: నిన్న సినిమా రిలీజ్.. నేడు వీడియో సాంగ్ రిలీజ్

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:43 PM

సాధారణంగా ఒక సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అవ్వాలంటే ఆ సినిమా ఓటీటీ బాట పట్టాలి. లేదు అంటే బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అయితే సినిమా రిలీజ్ కు ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేయాలి.

Srinivasa Mangapuram

సాధారణంగా ఒక సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అవ్వాలంటే ఆ సినిమా ఓటీటీ బాట పట్టాలి. లేదు అంటే బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అయితే సినిమా రిలీజ్ కు ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేయాలి.అది కాకుండా ఇది కాకుండా సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే వీడియో సాంగ్ రిలీజ్ చేయడం వింతగా ఉంది కదా. అవును.. ఆ వింత చేసింది శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) మేకర్స్. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jaya Krishna) హీరోగా పరిచయం చేస్తూ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు .. మోహన్ బాబు కీలక పాత్ర అనగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.


అంతేనా ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఓ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేశాయి. కానీ, చివరకు ఇవేమి శ్రీనివాస మంగాపురంను కాపాడలేకపోయాయి. మిక్స్డ్ టాక్ అందుకొని ఈ సినిమా యావరేజ్ కలక్షన్స్ తో ముందుకు కొనసాగుతోంది. ఇక సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లనే కనీసం కలక్షన్స్ కూడా ఆందుకోలేకపోయింది అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మహేష్ బాబు కొంచెం పూనుకొని అన్న కొడుకును నిలబెడతాడు అనుకుంటే.;. ఒక్క వీడియో బైట్ తో టాటా బై బై చెప్పేశాడు. చిన్న సినిమాలకే ప్రీ రిలీజ్ఈవెంట్స్ చేస్తున్న టాలీవుడ్ లో ఒక స్టార్ కుటుంబం నుంచి వస్తున్న జయకృష్ణ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు.


ఇక ఇప్పుడు గురువారం రిలీజ్ అయిన సినిమాలోని వీడియో సాంగ్ ను శుక్రవారం యూట్యూబ్ లో అధికారికంగా రిలీజ్ చేశారు. గుండె పేలిపోతుందే అంటూ సాగే వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాషా అందం.. జయకృష్ణ ఎక్స్ప్రెషన్స్ ఈ సాంగ్ లో అదిరిపోయాయి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ లేకపోవడంతో ఇలా వీడియో సాంగ్స్ రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి వీడియో సాంగ్ చూసి శ్రీనివాస మంగాపురం సినిమాకు ప్రేక్షకులు వెళ్తారేమో చూడాలి.

Updated Date - Jul 31 , 2026 | 09:59 PM