Om: ధనుష్ 'ఓం' మూవీ కథ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

ABN , Publish Date - Aug 01 , 2026 | 09:45 AM

ధనుష్ 'ఓం' మూవీ కథ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న 'ఓం' (OM)చిత్రం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2015లో జరిగిన శేషాచలం ఎర్రచందనం ఎన్‌కౌంటర్ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ సాధారణ వ్యక్తిగా కనిపిస్తూనే, స్పై యాంగిల్  ఉన్న రోల్ లో కనిపిస్తున్నారట.  ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్, ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబందించిన ఫొటోలో నెట్టింట వైరల్అ అవుతున్నాయి. అలాగే, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా విదేశాల్లో ఉండే వ్యాపారవేత్తగా కీలక పాత్ర పోషిస్తారని, నటుడు ఇంద్రన్స్ ధనుష్ పాత్రకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా కనిపిస్తారని, ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ సన్నివేశాలను తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 2015లో జరిగిన శేషాచలం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిలో పలువురు తిరువణ్ణామలై జిల్లాకు చెందినవారే. దీంతో సినిమా కథ నిజంగానే ఆ ఘటన నుంచి స్ఫూర్తి పొందిందా అనే చర్చ .మొదలైంది. ఈ సినిమాలో ఓ నటి పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ పాత్రను ఎంతో బలంగా, సహజంగా తీర్చిదిద్దాలని పలువురు నెటిజన్లు  కోరుతున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. 

Updated Date - Aug 01 , 2026 | 09:55 AM