విజయ్‌కు త్రిష అభిమానుల స్పెషల్ వెల్‌కమ్.. మేనమామ అంటూ పోస్టర్లు వైరల్
ABN, Publish Date - Sep 29 , 2026 | 09:09 AM
తాజాగా త్రిష అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అంటించిన పోస్టర్లు తమిళనాట రాజకీయాల్లో మరోసారి ప్రధానంగా చర్చల్లోకి వచ్చింది.
సినీ నటుడిగా ఉన్న సమయంలోనే భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విజయ్.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే రేంజ్‌లో దూసుకెళుతున్నాడు. తాజాగా మదురై పర్యటనకు వెళ్లిన సీఎం విజయ్ (CM Vijay) కు త్రిష అభిమానుల సంఘం (Trisha Fans' Welfare Association) వినూత్నంగా స్వాగతం పలికింది.
తన ఎన్నికల హామీగా ఇచ్చిన మేనమామ బంగారు ఉంగరం పథకాన్ని ప్రారంభించేందుకు సోమవారం మదురై వెళ్లిన ముఖ్యమంత్రి విజయ్‌ను ఆహ్వా నిస్తూ నటి త్రిష అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు (Maternal Uncle Posters) అంటించారు.
ఆ పోస్టర్‌లో రాష్ట్రంలో జన్మించిన శిశువులకు సీఎం విజయ్ మేనమామగా తోడుంటారన్న వాఖ్యంతో విజయ్-త్రిష ఫొటోలు ముద్రించారు. అధికార టీవీకే కార్యకర్తలు అంటించిన పోస్టర్ల కంటే త్రిష అభిమానుల పోస్టర్లే సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.