దర్శన్‌కు ఎదురుదెబ్బ.. అప్రూవర్ విచారణకు గ్రీన్ సిగ్నల్!
ABN , Publish Date - Sep 29 , 2026 | 08:48 AM
రేణుకాస్వామి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ ను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుకు గడువు తప్పినట్టయ్యింది.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసు (Renukaswamy Murder Case) లో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ (Pradosh Rao) ను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుకు గడువు తప్పినట్టయ్యింది. నటుడు దర్శన్ (Darshan) బెంగళూరు సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తద్వారా అప్రూవర్ విచారణను అడ్డుకునేందుకు ఉన్న చివరి అవకాశం కూడా తప్పినట్టయ్యింది.
హత్యకేసులో నిందితులపైకి ప్రదోష్ ఎస్ రావ్ అప్రూవర్‌గా ముందుకొచ్చాడు. దీన్ని వ్యతిరేకిస్తూ దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మి (Vijayalakshmi) సెషన్స్ కోర్టు, హైకోర్టులలో పిటిషన్ దాఖలు చేశారు. వీటి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని నటుడి తరపు న్యాయవాదులు భావించారు. సోమవారం నుంచి అప్రూవర్‌ను విచారించేందుకు కోర్టు సిద్ధమైంది.
ఈలోగానే స్టే పొందాలని దర్శన్ భావించారు. ప్రదోష్ రావ్ కోర్టు ముందు వెల్లడించేందుకు ముందుగానే కట్టడి కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో ప్రదోషారావు విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించినట్టయ్యింది.
ప్రదోష్ రావ్, న్యాయాధికారి సుజాత సామ్రాణి ముందు హాజరై తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే పోలీసులు సేకరించిన సాక్ష్యాలతో అతడి వివరణలను పోల్చనున్నారు. అన్నీ సమంజమైతే అప్రూవర్ చెప్పిన అంశాలను కోర్టు పరిగణించనుంది. ఒకవేళ భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ప్రదోష్‌ను మళ్లీ నిందితుడిగా చేయనున్నారు.