కమల్ - రజనీ మల్టీస్టారర్‌లో త్రిష!
ABN, Publish Date - May 12 , 2026 | 11:05 AM
అందాల తార త్రిష ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు- ఇప్పుడు మరో న్యూస్ తోనూ త్రిష పేరు మారుమోగి పోతోంది.
అసలు సిసలు మల్టీస్టారర్స్ వెలుగు చూడక కొన్నేళ్ళయింది. ఇద్దరు సమాన స్థాయి క్రేజ్ కలిగిన స్టార్స్ నటించినప్పుడే అది 'రియల్ మల్టీస్టారర్' అవుతుంది. మిగిలినవి కేవలం 'మల్టీస్టారర్స్'గానే మిగులుతాయి. ఇప్పుడు అలాంటి మూవీగా కమల్ హాసన్, రజనీకాంత్ కలసి నటిస్తోన్న సినిమా రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మూవీలో త్రిష నటిస్తోందన్న వార్త ప్రస్తుతం తమిళ తంబీలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆదివారం జరిగిన విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా సోషల్ మీడియా చిత్రీకరించింది. విజయ్ తో "గిల్లీ"లో నటించి గ్రాండ్ సక్సెస్ చూసిన త్రిష ఈ మధ్య 'లియో', 'గోట్'లోనూ నటించి ఆయనకు లక్కీ గాళ్ అనే పేరు సంపాదించారు. ఇప్పుడు అరుదైన మల్టీస్టారర్ లో కమల్, రజనీతో కలసి నటించబోవడం కూడా విశేషంగా మారింది.
త్రిష ఇంతకు ముందు రజనీకాంత్ Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) చిత్రాల్లో తళుక్కుమన్నారు. ఆ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సీనియర్ స్టార్స్ తోనూ త్రిష నటించి ఆకట్టుకున్నారు. రజనీ, కమల్, విజయ్ ముగ్గురితోనూ త్రిష నటించినా, పాలిటిక్స్ ఈక్వేషన్స్ లో మాత్రం విజయ్ కి అచ్చి వచ్చారని తమిళ జనం అంటున్నారు. ఈ ముగ్గురు స్టార్స్ కూడా తమిళ రాజకీయాలతో సంబంధం ఉన్నవారే కావడం విశేషం. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఆశించారు. రజనీ కూడా ఉత్సాహం చూపించారు. వస్తాననీ అందరిలోనూ ఆశలు రేపారు. చివరకు తాను రాజకీయాల్లోకి రావడానికి ఆరోగ్యం సహకరించడం లేదని నీరు గార్చారు. ఇక కమల్ హాసన్ 'మక్కల్ నీది మయమ్' పార్టీ పెట్టి 2021 ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. అలా ఒకరు పార్టీ పెడతానని పెట్టని సూపర్ స్టార్, మరొకరు పార్టీ పెట్టి పరాజయాన్ని చవిచూసిన స్టార్ హీరో- వీరిద్దరితోనూ గతంలో నటించిన త్రిష ఇప్పుడు వారిద్దరూ కలసి నటించే సినిమాలో నటించబోవడం నిజంగా విశేషమే. ఎందుకంటే 'టీవీకే' పార్టీతో గెలుపు సాధించి ముఖ్యమంత్రి అయిన విజయ్ ప్రేయసిగా ప్రస్తుతం త్రిషకు మరింత పాపులారిటీ వచ్చింది. ఈ కోణంలో కమల్, రజనీ కాంబోలో వచ్చే సినిమాలో త్రిష నటించడం విశేషాలకే విశేషం అంటున్నారు పరిశీలకులు.
విజయ్ (Vijay) కి లక్కీ గాళ్ అంటున్నారు జనం. కానీ, రజనీకాంత్ తో త్రిష కలసి నటించిన 'పేట్ట' పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక కమల్ హాసన్ తో త్రిష స్క్రీన్ షేర్ చేసుకున్న 'మన్మధన్ అంబు, తూంగవనమ్" పరాజయం పాలయ్యాయి. ఈ మధ్య వచ్చిన మణిరత్నం సినిమా 'థగ్ లైఫ్'లోనూ కమల్, త్రిష కలసి నటించారు. ఆ మూవీ ఎలాంటి పరాజయం పాలయిందో అందరికీ తెలిసిందే. అలా రజనీ, కమల్ ఇద్దరికీ అంతగా అచ్చిరాని త్రిషను వారి మల్టీస్టారర్ లో ఎంచుకోవడంపై సినీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం తమిళనాట విజయ్ పాలిటిక్స్ కారణంగా త్రిషకూ మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో కమల్- రజనీ మల్టీస్టారర్ లో త్రిషను ఎంపిక చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఈ సారి కమల్-రజనీకి త్రిష ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ
అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను
Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!