సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కమెడియన్ వడివేలు 100 కోట్ల భవంతిని చూశారా.. ‘హౌస్ టూర్’ వీడియో వైరల్

ABN, Publish Date - Oct 30 , 2026 | 07:33 PM

దక్షిణాది చిత్రసీమలో తనదైన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో రెండు దశాబ్దాల పాటు తిరుగులేని నవ్వుల రారాజుగా ఏలిన స్టార్ కమెడియన్, ‘వైగై పుయల్’ వడివేలు. తాజాగా ఆయన లగ్జరీ హోమ్‌కు సంబంధించిన ప్రత్యేక ‘హౌస్ టూర్’ వీడియో వైరల్ అవుతోంది.

Vadivelu House Tour

దక్షిణాది చిత్రసీమలో తనదైన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో రెండు దశాబ్దాల పాటు తిరుగులేని నవ్వుల రారాజుగా ఏలిన స్టార్ కమెడియన్, ‘వైగై పుయల్’ వడివేలు (Vadivelu). ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు దీటుగా పారితోషికం అందుకున్న ఆయన, ఇటీవల మళ్లీ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం ధనుష్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న వడివేలు.. తాజాగా తన సంపాదన, అభిరుచికి నిదర్శనంగా నిర్మించుకున్న ఓ విలాసవంతమైన ఇల్లు ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.


తమిళనాడులోని తన సొంత గడ్డ మధురైలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఆయన అత్యంత వైభవోపేతంగా ఈ భారీ భవంతిని నిర్మించారు. ఈ రాజప్రసాదం లాంటి ఇంటి విలువ దాదాపు రూ.100 కోట్లకు పైమాటేనని సమాచారం. 200 మందికి పైగా సభ్యులున్న తన ఉమ్మడి కుటుంబం అంతా కలిసి ఒకేచోట పండుగలు, శుభకార్యాలు జరుపుకోవాలనే సదాశయంతోనే ఆయన దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సంప్రదాయ తమిళ గ్రామీణ శైలిని ప్రతిబింబించేలా విశాలమైన వరండాలు, పాతకాలపు అరుగులు, అందమైన వినాయకుడి గుడి, ఆహ్లాదాన్ని పంచే పండ్ల తోటలతో ఒకవైపు ప్రకృతి ఒడిని తలపిస్తూనే.. మరోవైపు ఆధునిక హంగులను జోడించారు.


ఈ ఇంటికి పూర్తి సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు.. భద్రత కోసం ఏకంగా 42 అధునాతన సీసీటీవీ కెమెరాలను అమర్చడం విశేషం. అంతేకాకుండా ప్రత్యేక కార్యాలయం, పెద్ద కార్ పార్కింగ్ వంటి సకల సదుపాయాలను ఇందులో సమకూర్చారు. ఈ లగ్జరీ హోమ్‌కు సంబంధించిన ప్రత్యేక ‘హౌస్ టూర్’ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు వడివేలు కలల సౌధాన్ని చూసి ఫిదా అవుతూ.. ‘బతికితే ఇలా బతకాలిరా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జయలలిత పాత్రలో త్రిష? ఎంజీఆర్ బయోపిక్‌లో వాస్తవాలు చూపిస్తారా?

రెండు పార్ట్‌లుగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా? మరో ‘కింగ్‌డమ్’ కాదు కదా..

Megaverse: ఒకే స్టేజ్‌పై చిరు, పవన్, చరణ్.. మెగావర్స్‌లో మెగా ట్రీట్

Updated Date - Oct 30 , 2026 | 07:39 PM