Vadivelu: ‘నాయి శేఖర్‌ రిటర్న్స్‌’ చూడాల్సిన చిత్రం

ABN , First Publish Date - 2022-12-28T17:49:26+05:30 IST

తన కొత్త చిత్రం ‘నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని ఆ చిత్ర హీరో వడివేలు అన్నారు. తాజాగా ఆయన తిరుచ్చెందూరు మురుగన్‌ ఆలయంలో..

Vadivelu: ‘నాయి శేఖర్‌ రిటర్న్స్‌’ చూడాల్సిన చిత్రం

తన కొత్త చిత్రం ‘నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని ఆ చిత్ర హీరో వడివేలు అన్నారు. తాజాగా ఆయన తిరుచ్చెందూరు మురుగన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన వడివేలుకు పూజారులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సెంథిల్‌ వేల్‌మురుగన్‌ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఏదైనా కష్టం ఏర్పడితే ఇక్కడకు వచ్చి స్వామి సేవలో పాల్గొంటాను. ఇలా చేయడంతో కష్టాలన్నీ తీరిపోతాయి. ‘నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌’ (Naai Sekar Returns) చిత్రం ఎంతో బాగా వచ్చింది. ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఈ సినిమాను చూసినవారు నాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. పెద్ద సక్సెస్‌ కావడంతో నిర్మాతలు కూడా హ్యాపీగా ఉన్నారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించే ‘మామన్నన్‌’ (Maamannan) చిత్రంలో నటిస్తున్నాను. ఆ తర్వాత ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2)లో ఓ పాత్ర పోషిస్తున్నాను. నేను రీఎంట్రీ ఇవ్వడంపై ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఆ దేవుడి ఆశీర్వాదఫలం’’ అని వడివేలు (Vadivelu) చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-28T17:49:29+05:30 IST