కమల్ హాసన్ కాదు.. హీరో సూర్య చేతికి ‘సింగ్ గీతం’!
ABN, Publish Date - Jun 24 , 2026 | 02:49 PM
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’. తెలుగులో గోల్డెన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు స్టార్ హీరో సూర్య అందించబోతున్నారు.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఎందరో సపోర్ట్ అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందించేందుకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) లైన్‌లోకి వచ్చారు.
వాస్తవానికి ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో యూనివర్సల్ హీరో, సింగీతం అభిమాన హీరో అయిన కమల్ హాసన్.. ముందే తెలిస్తే ఈ సినిమాలో నేనూ భాగమయ్యేవాడినని పేర్కొన్నారు. సింగీతంపై తన ప్రేమను చాటుకున్నారు. కానీ, ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు అందించే విషయంలో కమల్ హాసన్ (Kamal Haasan) కాకుండా, సూర్య ముందుకు రావడం ఆసక్తికరమైన పరిణామంగా భావించవచ్చు. ఒక లెజెండరీ దర్శకుడిపై ఉన్న గౌరవంతో ‘సింగ్ గీతం’ తమిళ వెర్షన్‌ను ఏజీఎస్ సినిమాస్ బ్యానర్ ద్వారా సూర్య విడుదల చేయబోతున్నారు. దీంతో కోలీవుడ్‌లోనూ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
‘సింగ్ గీతం’ తమిళ వెర్షన్‌ను జూన్ 26న విడుదల చేయబోతున్నారు. తమిళ ప్రేక్షకులలో సింగీతం శ్రీనివాసరావుకు ఉన్న విపరీతమైన ప్రజాదరణతో పాటు.. కమల్ హాసన్, సూర్యల మద్దతు తోడవడంతో ఈ చిత్రం అక్కడ కూడా భారీ ఆదరణ పొందుతుందని అంతా అంచనా వేస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ ‘సింగీతం’ సినిమాలు అప్పట్లో రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పుడీ లెజెండ్ నుంచి వస్తోన్న ‘సింగ్ గీతం’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?
పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!