Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:47 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతోన్న ‘తలైవర్ 173’ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Dharman The Deadly Doctor First Look

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Universal Hero Kamal Haasan) ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. కమల్ హాసన్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌పై రూపొందుతోన్న రజనీకాంత్ 173వ సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ధర్మన్’ (Dharman - The Deadly Doctor) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని గమనిస్తే.. డాక్టర్ కోటులో డెడ్లీ లుక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ లుక్ చూస్తే ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. క్లాసిక్ బ్లూ కలర్ డాక్టర్ సర్జికల్ సూట్ ధరించి, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని సూపర్‌స్టార్ ఇచ్చిన పోజ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. రజనీకాంత్ చేతికి రక్తంతో తడిసిన సర్జికల్ గ్లౌవ్స్ ఉన్నాయి, అందులో ఒక చేత్తో సర్జికల్ బ్లేడ్‌ను పట్టుకుని ఉన్నారు. చేతులు, ఆ బ్లేడ్ పూర్తిగా రక్తంతో నిండి ఉండటం చూస్తుంటే.. టైటిల్‌కు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మెడికల్ ఎక్విప్‌మెంట్, పగిలిన అద్దాలు, కిటికీ గుండా కనిపిస్తున్న సిటీ వ్యూ.. ఇవన్నీ చూస్తుంటే ఇదొక హై-వోల్టేజ్ మెడికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది.


డాక్టర్ డ్రెస్‌లో ఉన్నా, వైట్ స్నీకర్స్ వేసుకుని తనదైన సిగ్నేచర్ స్టైల్‌తో రజనీకాంత్ మాస్ లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. కింద రక్తంతో తడిసిన ఒక బాడీ, స్ట్రెచర్ కూడా కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అనిపిస్తోంది. ఈ చిత్రానికి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్స్ చేసిన అశ్వత్.. రజనీకాంత్‌ను ఇంత వైల్డ్ అండ్ డెడ్లీగా చూపించబోతుండటం విశేషం. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ధర్మమే గెలుస్తుంది’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘జైలర్ 2’ తర్వాత డెడ్లీ డాక్టర్‌గా రానున్న సూపర్ స్టార్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే!

ఇవి కూడా చదవండి:

‘వసుదేవసుతం’.. కృష్ణుడిపై వస్తోన్న మరో అద్భుతమైన సినిమా!

‘పెద్ది’ పోరాటంలో నేనూ ఒకడినై.. ప్రయాణించా: చిరంజీవి

పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుంది: ఐశ్వర్య లక్ష్మి

Updated Date - Jun 24 , 2026 | 10:52 AM