Suriya : మరోసారి తన ఉదారత చూపించాడు..!

ABN , First Publish Date - 2023-09-28T16:46:57+05:30 IST

అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు తమిళ హీరో సూర్య. తాజాగా ఆయన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Suriya : మరోసారి తన ఉదారత చూపించాడు..!

అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు తమిళ హీరో సూర్య. తాజాగా ఆయన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్‌.. హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్‌ క్లబ్‌లో కొన్నేళ్లుగా మెంబర్‌గా ఉన్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవింద్‌ మరణించారు. ఈ విషయం తెలుసుకున్కన సూర్య వెంటనే అరవింద్‌ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. వారితో ధైర్యాన్ని నింపారు. తాజాగా ఆ ఫొటోలు బయటకు రావడంతో ఆయనపై మరింత అభిమానం, గౌరవం పెరిగింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ సూర్య అభిమాని ఒకరు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు సూర్య.

Suriya-2.jpg

ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో పది భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్రీడీలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగితమందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే!

Updated Date - 2023-09-28T16:58:11+05:30 IST