సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లోకేష్ కనగరాజ్‌ ‘ఆర్ఎక్స్‌’లో రెజీనా!

ABN, Publish Date - Nov 09 , 2026 | 03:46 PM

లోకేష్ కనగరాజ్‌కు చెందిన జీ స్క్వాడ్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆర్ఎక్స్‌’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Rx Movie

భారతీయ సినిమా రంగంలోని రెండు ప్రముఖ సంస్థలు చేతులు కలిపి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ జీ స్క్వాడ్‌, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ‘ఆర్ఎక్స్‌’ చిత్రాన్ని రూపొందిస్తోంది. రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. వివిధ భాషల్లో తన నిర్మాణ సంస్థ పరిధిని విస్తరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, తమిళ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘మొదరాత్రి' వంటి చిత్రాలతో తమిళంలోనూ అలరించింది. వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన నిర్మాణ ప్రస్థానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.


‘ఆర్.ఎక్స్.’ కోసం లోకేష్ కనగరాజ్‌కు చెందిన జి స్వ్వాడ్‌తో కలిసి పనిచేయడం ద్వారా విభిన్నమైన కథలను ప్రోత్సహించడంతో పాటు, కొత్త క్రియేటివ్ పార్ట్‌నర్‌షిప్స్‌కు మద్దతు ఇవ్వాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు అర్థమౌతోంది. తాజాగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రెజీనా కసాండ్రా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ‘ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఎ వాయిస్!’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ మిస్టరీ, ఉత్కంఠను పెంచుతోంది.


ప్రింటెడ్ బ్లౌజ్‌తో కూడిన సంప్రదాయ మస్టర్డ్ ఎల్లో కలర్ చీరలో రెజీనా రద్దీగా ఉన్న రైలులో ప్రయాణికుల మధ్య నిలబడి కనిపిస్తున్నారు. ఆమె ముఖంలో కనిపిస్తున్న సీరియస్‌నెస్ ఏదో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న పాత్రలా అనిపిస్తోంది. పోస్టర్‌పై కనిపించే ఈసీజీ తరహా గీతలు కూడా సస్పెన్స్‌ను మరింత పెంచుతున్నాయి. రెజీనా పవర్‌ఫుల్ లుక్ ఆమె పాత్రపై ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్ డిజైన్ చూస్తుంటే ఈ సినిమా రా అండ్ రియలిస్టిక్, గ్రిప్పింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని అనిపిస్తోంది. ‘సిల నేరంగళిల్ సిల మనిధర్గల్’, ‘బాంబ్’ వంటి చిత్రాలతో తనదైన కథన శైలికి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హరిహరన్ రాజు అందించిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆశమీర అయ్యప్పన్ సంభాషణలు రాశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, ఎస్.కె. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటర్‌గా, కె. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ భూపతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చెన్నైలో పూర్తి చేశారు. దీంతో ప్రధాన చిత్రీకరణ విజయవంతంగా ముగిసింది.

ALSO READ:
‘రామాయణం’పై వర్మ ప్రశంసల వర్షం.. విమర్శకులకు తనదైన స్టైల్‌లో కౌంటర్!

Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదం.. దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్‌!

Chandini Chowdary: చాందిని చౌదరి.. బాబీ సింహ.. ఓ డార్క్ కామెడీ

Updated Date - Nov 09 , 2026 | 03:50 PM