ఓటీటీకి వచ్చేస్తోన్న జైలర్ 2..
ABN, Publish Date - Nov 03 , 2026 | 08:49 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) - దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2(Jailer 2). గత నెల రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) - దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2(Jailer 2). గత నెల రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. కేవలం రజనీ ఎలివేషన్స్ కోసమే ఈ సినిమాకి ప్రేక్షకుల క్యూ కట్టారు అంటే అతిశయోక్తి కాదు. రజనీ కెరీర్ లోనే జైలర్ 2 సంచలనం సృష్టిస్తూ దాదాపు రూ. 750 - రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ సృష్టించింది. కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన నంబర్ వన్ చిత్రంగా నిలిచిన రోబో 2.0 లైఫ్‌టైమ్ రికార్డులను దాటేసి జైలర్-2 ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
జైలర్ 2 లో రజనీ ఎలివేషన్స్, స్టార్ క్యామియోస్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. మొదటి పార్ట్ లో ఉన్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కనిపించగా.. సెకండ్ పార్ట్ లో వారితో పాటు అదనంగా బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా కనిపించి కనువిందు చేశాడు. ఇక ఎస్ జె సూర్య, విద్యా బాలన్ తమ నటనతో ఫ్యాన్స్ ని ఫిధా చేశారు. ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ఓటీటీ రిలీజ్ వార్తలతో జైలర్ 2 నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు జైలర్ 2 ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. పార్ట్ 1 కూడా అమెజాన్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
జైలర్ 2 నవంబర్ 12 లేదా 13 నుంచి జైలర్ 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. థియేట్రికల్ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్లో అదనపు సన్నివేశాలు కూడా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొదటి నుంచి మోహన్ లాల్, సంతానం సీన్స్ ని నిడివి ఎక్కువ కావడంతో తొలగించారని పెద్ద వివాదమే జరిగింది. ఆ సీన్స్ అన్నింటినీ.. ఓటీటీలో యాడ్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి థియేటర్ లో రికార్డ్ కలక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Pocket Rockkets: కలకంటే రియాలిటీ బావుంది..
థమన్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మళ్లీ కలుస్తారా
‘సత్యవాన్ సావిత్రి’ నుంచి ‘చక్కని కళ్ళ పిల్లా’.. సెకండ్ సింగిల్ విడుదల