Pocket Rockkets: కలకంటే రియాలిటీ బావుంది..

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:30 PM

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) మరోసారి హిట్ కొట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది.

Pocket Rockkets

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) మరోసారి హిట్ కొట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కమీటీ కుర్రోళ్లు సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న మెగా డాటర్.. ఇప్పుడు 'పాకెట్ రాకెట్స్’ (Pocket Rockkets) అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. త్రినాథ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంఠం, జెడి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పాకెట్ రాకెట్స్. రుద్ర అత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన అనౌన్స్ మెంట్ వీడియో, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా పాకెట్ రాకెట్స్ నుంచి ఫస్ట్ హ్యాండ్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇద్దరు కుర్రాళ్ళు.. ఎప్పటికైనా తాము అనుకున్నది సాధించాలని కలలు కంటూ కష్టపడుతూ ఉంటారు. వారికి ఒక అమ్మాయి పరిచయమవుతుంది. డబ్బులిచ్చి.. శ్రీలంక పంపి గ్యాంబ్లింగ్ లో బాగా డబ్బు సంపాదించమని చెప్తుంది. అక్కడికి వెళ్ళాక ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఏమైయ్యారు.. ? ఆ జూదం మత్తులో వారి జీవితాలు ఎక్కడ వరకు వెళ్ళాయి. ఆ అమ్మాయిని వారు ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది.. ? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వారు తమ జీవితాన్ని మార్చుకున్నారా.. లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


యువత ఆశయాలు, ఆర్థిక ఇబ్బందులు, పెద్ద కలలను సాకారం చేసుకునే ప్రయాణంలో ఎదురయ్యే ఊహించని రిస్క్‌లు, ప్రమాదకరమైన సవాళ్ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. జేడీ చక్రవర్తి, శ్రీనివాస అవసరాల క్యారెక్టర్స్ సినిమాపై హైప్ ని ఇంకా పెంచుతున్నాయి. జ్ఞాని సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. డిసెంబర్ 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో నిహారిక నిర్మాతగా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Updated Date - Nov 03 , 2026 | 07:37 PM