‘సత్యవాన్ సావిత్రి’ నుంచి ‘చక్కని కళ్ళ పిల్లా’.. సెకండ్ సింగిల్ విడుదల
ABN, Publish Date - Nov 03 , 2026 | 06:23 PM
కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా నుంచి రెండో పాట ‘చక్కని కళ్ళ పిల్లా’ విడుదలైంది. సామ్ సి.ఎస్. సంగీతం అందించిన ఈ పాటను కమలజా రాజగోపాల్, కిరణ్ బిజూ ఆలపించారు. నవంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
'సత్యవాన్ సావిత్రి' సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'చక్కని కళ్ళ పిల్లా' సాంగ్ విడుదలైంది. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు సామ్ సి.ఎస్. స్వరాలు సమకూర్చగా, కమలజా రాజగోపాల్, కిరణ్ బిజూ దీనిని పాడారు. రామ్ శ్రీవత్స దీనిని రాశారు. సంతోష్ కుమార్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. సత్యవాన్ సావిత్రి సినిమా నవంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మిస్కిన్, చారుకేశ్, బాల శరవణన్, శిల్ప మంజునాథ్ ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసులో .. 22 ఏళ్ళ యువతి అరెస్ట్
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Updated at - Nov 03 , 2026 | 06:33 PM