థమన్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మళ్లీ కలుస్తారా
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:14 PM
టాలీవుడ్లో తిరుగులేని సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌గా పేరుగాంచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (SS Thaman) కాంబోకి త్వరలోనే బ్రేక్ పడనుందా? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది.
టాలీవుడ్లో తిరుగులేని సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌గా పేరుగాంచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (SS Thaman) కాంబోకి త్వరలోనే బ్రేక్ పడనుందా? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. కొన్ని కాంబోలను ప్రేక్షకులు అంతా త్వరగా మర్చిపోలేరు. అలాంటి కాంబోనే త్రివిక్రమ్ - థమన్. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అనే చెప్పాలి. 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో', 'గుంటూరు కారం'.. సినిమాలు ఏ రేంజ్ లో రచ్చ చేసాయో అందరికీ తెల్సిందే. గుంటూరు కారం ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయినా మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసింది.
ఇక గుంటూరు కారం తరువాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆదర్శ కుటుంబం. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. ఎప్పటిలానే థమన్.. కాపీ కొట్టిన ట్యూన్స్ ఇచ్చాడని, అసలు ఆ సాంగ్స్ వింటుంటే హైప్ రావడం లేదని, థియేటర్ లో వెంకీ ఫ్యాన్స్ కూడా సాంగ్స్ కి కనీసం చప్పట్లు కూడా కొట్టలేదని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇకనుంచి త్రివిక్రమ్.. థమన్ తో వర్క్ చేయవద్దని చెప్పుకొచ్చారు.
అయితే ఫ్యాన్స్ మాట విన్నాడో లేక వేరే ఇతర కారణమో తెలియదు కానీ, త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకి థమన్ ని పక్కన పెట్టాడు. ప్రస్తుతం గురూజీ తెరకెక్కిస్తోన్న చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో కచ్చితంగా గురూజీ.. ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అజ్ఞాతవాసి కోసం త్రివిక్రమ్, అనిరుధ్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇంకోపక్క దేవర సినిమాకి కూడా అనిరుధ్ నే వర్క్ చేశాడు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కి అనిరుధ్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసు.. అందులో గాడ్ ఆఫ్ వార్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. కాపీ ట్యూన్స్, నెగిటివిటీ లాంటివి లేకుండా మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్. దీంతో గురూజీ - థమన్ మధ్య విభేదాలు తలెత్తాయా..? ఎన్టీఆర్ సినిమాతో పాటు త్రివిక్రమ్ రాబోయే ఇతర ప్రాజెక్టుల్లో కూడా తమన్ ఉండే అవకాశాలు తక్కువేనని టాక్. మరి ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమేనా లేక ఈ కాంబినేషన్‌కి శాశ్వతంగా ఎండ్ కార్డ్ పడినట్లేనా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఓమ్.. సాయిపల్లవి అన్ని కోట్లు తీసుకుందా
Pocket Rockkets: నిహారిక కొణిదెల కొత్త సినిమా టీజర్ వచ్చేసింది
ENE 2 Trailer: సినిమా హిట్ కాకపోతే ఉరి తీయండి..