జైలర్ 2.. మోహన్ లాల్ కి అన్యాయం
ABN, Publish Date - Oct 16 , 2026 | 06:55 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన తమిళ యాక్షన్ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2) అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన తమిళ యాక్షన్ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2) అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అనిరుధ్ మ్యూజిక్, నెల్సన్ టేకింగ్.. స్టార్స్ క్యామియోలతో జైలర్ 2 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా మొదటి రోజే రికార్డు కలక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదటి భాగంలో తనదైన స్పెషల్ క్యామియోతో థియేటర్లను షేక్ చేసిన మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్, ఈ సీక్వెల్లో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించాడు.
అయితే ఈ సినిమాలో ఆయన పాత్రకు అన్యాయం జరిగిందని మలయాళ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ సీన్స్ ని చాలావరకు ట్రిమ్ చేశారని, మూడు సీన్స్ కన్నా ఎక్కువ ఉండాలని చెప్పుకొస్తున్నారు. ఈ విషయమై మోహన్ లాల్ కాస్ట్యూమ్ డిజైనర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షమ్సుద్దీన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగపూరిత పోస్ట్ పెడుతూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాడు. మోహన్‌లాల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు డిఫరెంట్ లుక్స్‌ను సినిమాలో నుంచి పూర్తిగా తొలిగించారని, మోహన్‌లాల్ వంటి గ్లోబల్ సూపర్ స్టార్ పాత్రకు సంబంధించిన దృశ్యాలను ఇలా ఎడిటింగ్‌లో కట్ చేయడం సరికాదని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా, ఇకపై తాను ఏ రకమైన సీక్వెల్ సినిమాలకు పని చేయబోనని ఆయన సంచలన ప్రకటన చేశాడు. సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఉపయోగించని ఆ అవుట్‌ఫిట్స్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇది కచ్చితంగా మోహన్ లాల్ కి అన్యాయమే అని చెప్పుకొస్తున్నారు. అయితే నెల్సన్ కేవలం మోహన్ లాల్ సీన్స్ మాత్రమే కాకుండా చాలా సీన్స్ ని కట్ చేసినట్లు తెలుస్తోంది. సంతానం సీన్స్, విజయ్ సేతుపతి సీన్స్ కూడా ట్రిమ్ చేసినట్లు సమాచారం. ఎంత స్క్రీన్ టైమ్ ఉన్నా మోహన్ లాల్ ప్రెజెన్స్ ఆయనకు వేరే లెవెల్ లో ఉంటుందని, ఇలాంటివి పెద్దగా పట్టించుకోకూడదని కొందరు చెప్పుకొస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛానళ్లలో వచ్చే సినిమాలు
రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?
జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!