రేర్ కాంబోతో మణిరత్నం లవ్ స్టోరీ.. ఇక ఊహించుకోండి
ABN, Publish Date - Jul 24 , 2026 | 07:27 PM
మణిరత్నం గ్రేట్ మాస్ అండ్ యాక్షన్ సినిమాలు ఎన్ని తీసినా, ఆయన లవ్ ట్రాక్స్ ఇచ్చే ఫీల్ మాత్రం వేరు. అందుకే ఆయన లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది.
సినిమాలలో ఎన్ని జానర్స్ ఉన్నా వాటిలో లవ్ స్టోరీస్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటాయి. ఈ విషయంలో సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్‌లో మణిరత్నం పేరు ముందు వరుసలో ఉంటుంది. మణిరత్నం (Mani Ratnam) గ్రేట్ మాస్ అండ్ యాక్షన్ సినిమాలు ఎన్ని తీసినా, ఆయన లవ్ ట్రాక్స్ ఇచ్చే ఫీల్ మాత్రం వేరు. అందుకే ఆయన లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది. ‘మౌనరాగం’ నుంచి మొదలు పెడితే ‘గీతాంజలి, రోజా, బొంబాయి, సఖి’.. న్యూజనరేషన్‌కు తగ్గట్టుగా వచ్చిన ‘ఓకే బంగారం’ వరకు.. ప్రతీ లవ్ స్టోరీ కూడా ప్రేక్షకుల మనసుల్లో సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది. అసలు ఆయన తీసే రెగ్యులర్ డ్రామాల్లో కూడా లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది.
ఇప్పుడు మరోసారి తన మార్క్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మణిరత్నం. ఈసారి ఆయన ఎంచుకున్న కాంబినేషన్ చూస్తే ఎవరైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో ఒక క్యూట్ లవ్ స్టోరీని మణిరత్నం ప్లాన్ చేశారు. ఈ క్రేజీ కాంబో వార్త విన్నప్పటి నుంచే సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా పూర్తయ్యాయి. కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ కూడా గ్రాండ్‌గా ప్రారంభమైందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి మేకోవర్. ఇన్నాళ్లూ గడ్డం, కాస్త బొద్దుగా ఉండే రఫ్ అండ్ టఫ్ లుక్‌లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పించిన విజయ్ సేతుపతి, ఈ మణిరత్నం సినిమా కోసం పూర్తిగా మారిపోయారు. తొలిసారి క్లీన్ షేవ్ చేసుకుని, బరువు తగ్గి నయా యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ లుక్‌లోకి మారిపోయారట. విజయ్ సేతుపతి లుక్ మార్చారంటేనే సినిమాలో కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. సినిమా గురించి వినిపిస్తున్న ఇంకో హాట్ టాపిక్ ఈ సినిమా డిజిటల్ బిజినెస్. ఈ చిత్రాన్ని మణిరత్నం తన సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ పై చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి కాకముందే, అప్పుడే డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ దిగ్గజాలు పోటీ పడుతున్నాయట. ఇప్పటికే ఓటీటీ బిజినెస్ క్రేజీ లెవల్ ధరకు లాక్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక సినిమా ఇంకా సెట్స్ మీదికి పూర్తిగా వెళ్లకముందే ఈ రేంజ్ బిజినెస్ జరగడం నిజంగా అరుదైన విషయం. ఏది ఏమైనా, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, హోమ్లీ అండ్ పర్ఫార్మర్ సాయి పల్లవి.. వీరిద్దరి కాంబినేషన్‌కి తోడు మణిరత్నం మ్యాజికల్ డైరెక్షన్ తోడైతే థియేటర్లలో బొమ్మ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంతైనా మణిరత్నం మార్క్ లవ్ స్టోరీస్‌కు ఉండే క్రేజే వేరు కదా!
ఇవి కూడా చదవండి:
‘జయం’లో ఛాన్స్.. పార్టీ చేసుకున్న బన్నీ.. తీరా చూస్తే!
నాని కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్.. ఇలా అయిందేంటి
త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...