సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రస్తుతానికి వాయిదా వేసిన తమిళ నిర్మాతలు

ABN, Publish Date - Aug 29 , 2026 | 08:40 AM

కోలీవుడ్ నిర్మాతలు బెట్టు సడలించారు. సెప్టెంబర్ 1 నుంచి సమ్మె చేస్తామన్న నిర్మాతలు దానిని తాత్కాలికంగా వాయిదా వేశారు.

Kollywood Strike

సెప్టెంబరు 1వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి వెల్లడించింది. కొత్త చిత్రాలు విడుదలైన తర్వాత ఎనిమిది వారాలకు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేలా నిర్మాతలు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర థియేటర్, మల్టీప్లెక్స్ యజమానుల సంఘం, మూవీ పంపిణీదారులు షరతు విధించారు. ఈ షరతుకు అంగీకరించపోతే సినిమాలను ప్రదర్శించమని ప్రకటించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్టు నిర్మాతల సంఘాలు, ఫెఫ్సీ ప్రకటించాయి.


ఈ నేపథ్యంలో నగరంలో నిర్మాతలు శుక్రవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం నిర్మాతల సంఘం అధ్యక్షుడు జీకేఎం తమిళ్ కుమరన్ విలేకరులతో మాట్లాడుతూ, 'తమిళ చిత్రపరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఈ నెల 26వ తేదీన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి రాజ్‌ మోహన్‌ను కలిసి చర్చించాం. ఇప్పుడు ఉన్న యధాతథ స్థితిని కొనసాగిం చాలని సూచించారు. పైగా అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం విజయ్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు. అందువల్ల వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చేపట్టదలచిన సమ్మెను వాయిదా వేస్తున్నాం' అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్‌ పాత్రలతో మెప్పిస్తున్న భామలు

Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్‌.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!

కృతి సనన్‌ రాఖీ యాడ్‌ వివాదం.. మధు చోప్రా హాట్‌ కామెంట్స్‌!

Updated Date - Aug 29 , 2026 | 09:32 AM