Jason Sanjay: ఇక మీదట నటుడిగా...
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:03 PM
దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్... త్వరలో నటుడు కాబోతున్నాడు. అతను హీరోగా తమిళ కుమరన్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఈ నెల 24న విడుదల అవుతోంది. సరిగ్గా ఆ తర్వాత వారమే అంటే విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సిగ్మా' రిలీజ్ కాబోతోంది. అంటే తండ్రి సినిమా మీదకే కొడుకు మూవీ రాబోతోందన్న మాట. విజయ్ కు అతని భార్యకు మధ్య సాగుతున్న వివాదంతో పిల్లలు తల్లి పక్షాన నిలిచారు. విజయ్ కూడా ఈ విషయంలో పబ్లిక్ గా ఎలాంటి స్పందన తెలియచేయలేదు. విజయ్ ఇటు సీఎం అవగానే... అతని కొడుకు సినిమా జనం ముందుకు రావడం అందరిలోనూ ఓ చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే దర్శకుడిగా అరంగేట్రమ్ చేస్తున్న జాసన్ సంజయ్... ఒకానొక సమయంలో త్రిషపైకి దూసుకెళ్ళాడని, తన తండ్రితో ఆమె సన్నిహితంగా మెలగడాన్ని అతను తట్టుకోలేకపోయాడనే కథనాలు కోలీవుడ్ లో బలంగా వినిపించాయి. దాంతో విజయ్ సైతం కొడుకును దూరం పెట్టేశాడని తెలిసింది. ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న జాసన్ సంజయ్ తొలి చిత్రం 'సిగ్మా'కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలని చాలామంది అనుకుంటున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. కొడుకు మీద ఎంత కోపం ఉన్నా... అతని కెరీర్ ను విజయ్ నాశనం చేయడనే కొందరు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు జాసన్ సంజయ్ ను వెండితెరపైకి హీరోగా తీసుకొచ్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. నటన మీద ఆసక్తి ఉన్న జాసన్ సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని, దీనిని తమిళ కుమరన్ నిర్మిస్తారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ కుమరన్ ఇటీవల పరిమళ అండ్ కో అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో రానున్నాయి.
ALSO READ:
Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్
Mysskin: విజయ్ సేతుపతి ఒక అగ్నిపర్వతం
Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది
Indian Movies: ఆ చిత్రాల్లో అగ్రస్థానంలో 'టాక్సిక్'!