సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తలైవర్ మ్యాజిక్కే వేరు: ‘జైలర్ 2’ సక్సెస్‌పై నెల్సన్

ABN, Publish Date - Oct 19 , 2026 | 04:50 PM

‘జైలర్ 2’ సినిమాకు అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు అంటూ ఆ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Nelson post on Jailer 2

‘జైలర్ 2’ (Jailer 2) సినిమాకు అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు అంటూ ఆ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) పేర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నెల్సన్ తెరకెక్కించిన ‘జైలర్ 2’ ఈ నెల 15న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh)తో కలసి ఆదివారం హీరో రజనీకాంత్‌కు నెల్సన్ దిలీప్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ విషయం తెలుపుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఈ ట్వీట్‌లో.. ‘‘థియేటర్లలో సందడి మామూలుగా లేదు. 'తలైవర్' మ్యాజిక్ అంటేనే వేరు. ‘జైలర్-2’ చిత్రానికి మీరు చూపిస్తున్న అద్భుతమైన ప్రేమకు, అందిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు. ప్రేక్షకులు ఇలా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటుంటే చూసే ఆ ఆనందమే వేరు. మీ అందరి ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.


మరోవైపు ‘జైలర్-2’ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఆది, సోమవారాలు కూడా సెలవులు కావడంతో ఈ చిత్రం వసూళ్ళు రూ.500 కోట్లకు చేరుకోవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ‘జైలర్’ తొలిభాగం వసూళ్లను రెండో భాగం అధిగమించినట్టే. టాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ, టాక్ పాజిటివ్‌గా రావడం, పండగ సీజన్ కావడంతో.. తెలుగులోనూ ఈ సినిమాకు భారీగా కలెక్షన్లను రాబడుతోంది.

ఇవి కూడా చదవండి:

ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు

బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ ర్యాంపేజ్.. తెలుగు రాష్ట్రాల్లో ‘విరోష్’ సందడి

‘జైలర్ 2’ సెట్‌లో మోహన్ బాబు.. ‘జైలర్ 3’లో ఏమైనా?

Updated Date - Oct 19 , 2026 | 04:50 PM