సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జస్ట్ 5 నిమిషాలకు అన్ని కోట్లా.. హృతిక్ రోషన్ మామూలోడు కాదు మావా

ABN, Publish Date - Oct 16 , 2026 | 05:44 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం జైలర్ కు సీక్వెల్‌గా వచ్చిన జైలర్-2 (Jailer 2) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

Hrithik Roshan

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం జైలర్ కు సీక్వెల్‌గా వచ్చిన జైలర్-2 (Jailer 2) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు గెస్ట్ రోల్, క్యామియో పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. అయితే సినిమా మొత్తంలోనూ అందరికంటే ఎక్కువగా హైలైట్ అయిన అంశం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన స్పెషల్ క్యామియోలో కనిపించి అదరగొట్టేశాడు.


ఈ చిత్రంలో ప్రీ-క్లైమాక్స్ ఘట్టంలో ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్ స్క్రీన్ మీద కేవలం ఐదు నిమిషాలకు కాస్త అటుఇటుగా మాత్రమే కనిపించాడు. అయితే ఆయన చేసిన ఆ చిన్న పాత్ర కోసం తీసుకున్న పారితోషికం గురించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం ఐదు నిమిషాల పాత్ర కోసం హృతిక్ రోషన్ అక్షరాలా రూ. 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. రజనీకాంత్, హృతిక్ రోషన్ కలసి కేవలం రెండు రోజులు మాత్రమే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారట. కేవలం రెండు రోజుల షూటింగ్, 5 నిమిషాల నిడివి గల పాత్ర కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం అందరినీ విస్మరిస్తోంది.


ఇక ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన విద్యా బాలన్ రూ. 6 కోట్లు, శివరాజ్‌కుమార్ రూ. 8 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో రజనీకాంత్ ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌లో భారీ మొత్తాన్ని అందుకోనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో వసూళ్లు పుంజుకోవడానికి హృతిక్ రోషన్ ఎంట్రీ ఏ మేరకు సహాయపడుతుందనే చెప్పాలి. ఏది ఏమైనా, అతి తక్కువ స్క్రీన్ టైమ్‌కు హృతిక్ తీసుకున్న ఈ భారీ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయం తెలిశాక నెటిజన్స్ హృతిక్ రోషన్ మామూలోడు కాదురా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ALSO READ:
Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్‌డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Aishwarya Lekshmi: లైఫ్‌ పార్టనర్‌ ముందు ఎలా ఉండాలంటే..

jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి

Updated Date - Oct 16 , 2026 | 05:45 PM