సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!

ABN, Publish Date - Jul 10 , 2026 | 10:34 PM

కోలీవుడ్‌లో తిరుగులేని కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్, సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Thamizh Murugan Frist Look

కోలీవుడ్‌లో తిరుగులేని కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran) మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘పొల్లాదవన్, ఆడుగలం, వడ చెన్నై, అసురన్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ (Thamizh Murugan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.


టైటిల్‌తో పాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను ధనుష్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ‘‘ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, తమిళ ప్రజలు, వారి నేలకి రాజు, నాయకుడు.. #sonofkottravai తమిళ్ మురుగన్’’ అంటూ పెట్టిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందనే విషయాన్ని ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. యుద్ధ క్షేత్రంలో వేలాది మంది సైనికుల మధ్య ధనుష్ ఒక భారీ ఏనుగుపై వీరుడిలా కూర్చొని ఉన్న విజువల్స్‌తో ఈ గ్లింప్స్‌ని వదిలారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్ ఓవర్, మ్యూజిక్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి.


వండర్‌బార్ ఫిలింస్, ప్రొడక్షన్ మైల్స్ టు గో బ్యానర్లపై ఈ చిత్రం సంయుక్తంగా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, అరివుమతి కథను సమకూర్చారు. వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌కు తోడు, ధనుష్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌

2026: జనవరి టు జూలై.. కర్ణాటకలో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలివే..

టాక్సిక్.. బాబోయ్ రెమ్యునరేషన్స్‌కే రూ. 100 కోట్లకు పైగా..!

Updated Date - Jul 10 , 2026 | 10:34 PM