అనిరుధ్ పెళ్లికి ఆ స్టార్ హీరోని పిలవలేదా.. కోలీవుడ్‌లో సరికొత్త రచ్చ
ABN, Publish Date - Nov 05 , 2026 | 05:56 PM
భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నారనే విషయం తెలియంది కాదు. అయితే, ఆయన పెళ్లి ఆహ్వానాలకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నారనే విషయం తెలియంది కాదు. ప్రస్తుతం ఈ వార్త సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీగా చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో అనిరుధ్ పెళ్లి భాజాలపై రోజుకో క్రేజీ రూమర్ వినిపిస్తుండగా.. తాజాగా చెన్నై సినీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి కోలీవుడ్‌లోని దాదాపు స్టార్ హీరోలు, అగ్ర నటీనటులందరికీ ఆహ్వానాలు అందుతున్నాయని, కానీ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోగా ఉన్న ఒకే ఒక్క స్టార్‌కు మాత్రం అనిరుధ్ పెళ్లి పిలుపు అందలేదంటూ తమిళ మీడియాలో జోరుగా వార్తలు మొదలయ్యాయి. ఆ హీరో మరెవరో కాదు.. స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush).
అనిరుధ్ వివాహ ఆహ్వానాల జాబితాలో ధనుష్ పేరు లేదనే వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తమిళ సినీ అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనిరుధ్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కుటుంబ సౌకర్యాన్ని, వారి వ్యక్తిగత పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు. గతంలో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్.. 2022లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి రజనీ ఫ్యామిలీ ఈవెంట్లలో ధనుష్ కనిపించడం తగ్గింది. ఈ కారణంగానే అనిరుధ్ పెళ్లి వేడుకకు ధనుష్ దూరంగా ఉండే అవకాశముందనే ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.
అయితే ఈ ప్రచారాన్ని ధనుష్, అనిరుధ్ అభిమానులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ధనుష్ ప్రోత్సాహంతోనే ‘3’ చిత్రంతో అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వై దిస్ కొలవెరి డీ’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కలయికను అభిమానులు ముద్దుగా ‘DnA’ అని పిలుచుకుంటారు. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా ఉండే అనిరుధ్.. తన సినీ గురువు, శ్రేయోభిలాషి అయిన ధనుష్‌ను తప్పకుండా ఆహ్వానించి తీరుతారని ఫ్యాన్స్ బల్లగుద్ది వాదిస్తున్నారు. ఒకవేళ ధనుష్ ఈ పెళ్లికి హాజరైతే అవాస్తవాలు రాసేవారు తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసుకుంటారా? అంటూ కొందరు అభిమానులు సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం ఈ ఇన్విటేషన్ వార్త కేవలం గాసిప్ మాత్రమేనా లేక నిజంగానే ఆహ్వానం అందలేదా? అనేది తెలియాలంటే సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అలా కాదంటే, ధనుష్‌ను అనిరుధ్ ఆహ్వానిస్తున్న ఫొటో ఏదైనా వస్తుందేమో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ యాక్టర్‌కు హీరోగా ఛాన్స్
భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ టాలెంట్.. నెట్టింట వైరల్
ఇంతింతై వటుడింతై.. నెల్సన్ గ్రాఫ్ చూశారా