ఇంతింతై వటుడింతై.. నెల్సన్ గ్రాఫ్ చూశారా

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:57 PM

వరుసగా ఐదు చిత్రాలకు పైగా సక్సెస్ చూసిన యంగ్ డైరెక్టర్స్ అతి కొద్దిమందే కనిపిస్తున్నారు.. వారిలో నేనున్నానని నిరూపించుకున్నారు ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

Nelson Dilipkumar

వరుసగా ఐదు చిత్రాలకు పైగా సక్సెస్ చూసిన యంగ్ డైరెక్టర్స్ అతి కొద్దిమందే కనిపిస్తున్నారు.. వారిలో నేనున్నానని నిరూపించుకున్నారు ‘జైలర్’ (Jailer) డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar). ఆయన గ్రాఫ్ చూస్తే పైకి పోతోందే తప్ప ఇప్పటి వరకు కిందకు పడిందే లేదు. దీంతో నెల్సన్ తరువాతి సినిమాపై మరింత బజ్ నెలకొంది. ‘జైలర్-2’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమా 800 కోట్ల రూపాయలకు పైగా రాబట్టి, కోలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో నంబర్ వన్‌గా నిలచింది. దాంతో ఒక్కసారిగా సినీ ఫ్యాన్స్ చూపు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ వైపు సాగుతోంది. ఇప్పటి వరకు నెల్సన్ డైరెక్షన్‌లో ఐదు చిత్రాలు తెరకెక్కాయి. ఒక్కో దానిని మించి మరోటి విజయం సాధిస్తూ సాగింది. తాజాగా ‘జైలర్-2’ ఘనవిజయంతో కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ నెల్సన్ సక్సెస్ పై డిస్కషన్ సాగుతోంది. నెల్సన్ రాబోయే చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కలసి నటిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మిస్తోన్న ఈ చిత్రం బడ్జెట్ వెయ్యి కోట్లు దాటుతోందనీ టాక్. ఇప్పటి వరకు ఒక్క తమిళ చిత్రం కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరలేదు. ‘జైలర్-2’కు ఆ ఛాన్స్ ఉందనుకున్నారు.. కానీ, ఆ సినిమా సైతం వెయ్యి కోట్లు టచ్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెయ్యి కోట్ల బడ్జెట్ తోనే కమల్-రజనీ సినిమా తెరకెక్కితే మరి ఎన్ని కోట్లు రాబట్టవలసి ఉంటుందని చర్చ సాగుతోంది.


నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘కొలమావు కోకిల’. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 8 కోట్ల రూపాయలతో తెరకెక్కి 73 కోట్లు రాబట్టింది. నెల్సన్ రెండో చిత్రం శివకార్తికేయన్ నిర్మించి నటించిన ‘వరుణ్ డాక్టర్’. ఈ మూవీ పాతిక కోట్లతో రూపొంది వంద కోట్లు చూసింది. రెండో సినిమాతోనే వంద కోట్లు చూసిన డైరెక్టర్ అంటూ నెల్సన్‌ను తమిళ తంబీలు భలేగా కీర్తించారు. విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ వెలుగు చూసింది. ఈ సినిమా 150 కోట్ల పెట్టుబడితో 300 కోట్ల రాబడిని పట్టేసింది. మళ్ళీ తమిళనాట నెల్సన్ పేరు మారుమోగి పోయింది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కించిన ‘జైలర్’ సినిమా 600 కోట్ల వరకు వసూలు చేసింది. ఎన్నో ఏళ్ళ తరువాత రజనీకాంత్‌కు దక్కిన జెన్యూన్ హిట్ అంటూ ‘జైలర్’ను సినీ ఫ్యాన్స్ పరిగణించారు. దాంతో మరోమారు నెల్సన్ పేరు సినిమా అభిమానుల పెదాలపై నాట్యం చేసింది. ‘జైలర్-2’ సినిమా సమయంలో రజనీకాంత్‌కు సీక్వెల్స్ అచ్చిరావు అనే టాక్ బయలు దేరింది. ఆ సెంటిమెంట్‌ను చెరిపేస్తూ 250 కోట్లతో రూపొందిన ‘జైలర్-2’ దాదాపు 800 కోట్ల గ్రాస్ చూసేసింది. అలా ఒక్కో సినిమాతో నెల్సన్ గ్రాఫ్ పెరుగుతూనే పోయింది. అందువల్ల రాబోయే నెల్సన్ మూవీపై ఓ స్పెషల్ బజ్ నెలకొంది.


నాలుగు దశాబ్దాల తరువాత కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth) కాంబోలో ఓ మూవీ వస్తోందంటేనే తమిళ సినీ ఫ్యాన్స్ మహా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ అనగానే ఆశలు మరింతగా పెరిగాయి. ‘జైలర్-2’ (Jailer 2) గ్రాండ్ సక్సెస్‌తో ఊపు మీదున్న నెల్సన్ దిలీప్ కుమార్.. కమల్ - రజనీ కాంబో మూవీని కూడా సక్సెస్ రూటులో సాగేలా చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి పాన్ ఇండియా మూవీగా రానున్న కమల్- రజనీ రీయూనియన్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో అన్న ఆసక్తి తమిళనాటనే కాదు యావద్భారతంలోని సినీ ఫ్యాన్స్‌లో చోటు చేసుకుంది. ఈ సారి నెల్సన్ రేంజ్ వేరేగా ఉంటుందనీ అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో?

ఇవి కూడా చదవండి:

అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్

Last Man in Tower: ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ఓటీటీకి అదిరిపోయే ఎమోషనల్ డ్రామా

వి.వి. వినాయక్ సమక్షంలో కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

Updated Date - Nov 04 , 2026 | 07:57 PM

Jailer 2: గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలే.. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిపడేశాడు

Jailer 2 Trailer: ఈ కాలపు స్టైల్.. అక్కడే బాంబు పెట్టడం 

Nelson Dilip Kumar: అత‌న్ని హీరోగా వ‌ద్ద‌న్నా.. ధ‌నుష్ ,విజ‌య్‌ల‌ను పెట్టుకోమ‌ని చెప్పా

Nelson Dilipkumar: కమల్, రజనీని.. నెల్సన్ హ్యాండిల్ చేయగలడా?

Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?