తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. ట్రెండింగ్‌లో త్రిష పేరు!
ABN , Publish Date - May 04 , 2026 | 11:07 AM
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, అందరి దృష్టి దళపతి విజయ్ నేతృత్వంలోని TVK పార్టీపైనే ఉంది. అదే సమయంలో త్రిష పేరు కూడా ట్రెండ్ అవుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, అందరి దృష్టి దళపతి విజయ్ (Thalapathy Vijay) నేతృత్వంలోని TVK (Tamilaga Vettri Kazhagam) పార్టీపైనే ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం విజయ్ పార్టీ ముందంజలో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే, ఈ రాజకీయ ఫలితాల నడుమ సోషల్ మీడియాలో అనూహ్యంగా నటి త్రిష (Heroine Trisha) పేరు ట్రెండింగ్‌లోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా విజయ్, త్రిష (Vijay and Trisha)ల మధ్య అనుబంధం గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో, ఈ ఫలితాల రోజున నెటిజన్లు వీరిద్దరి గురించే చర్చించుకుంటున్నారు.
సరిగ్గా ఇదే రోజు (మే 4) త్రిష పుట్టినరోజు కావడం విశేషం. బర్త్‌డే వేళ ఒకవైపు తన స్నేహితుడు విజయ్ రాజకీయంగా విజయం దిశగా దూసుకుపోతుండటంతో, ఈ డబుల్ సెలబ్రేషన్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా విజయ్ తన రాజకీయ విజయంతో త్రిషకు అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇస్తారా? అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మ్యారేజ్ రూమర్స్‌కు తగినట్లుగానే, ఈ శుభసందర్భంగా ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? అనేలా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో త్రిష తిరుమలలో కనిపించడం కూడా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉంటే, ఇంతకు ముందు విజయ్, త్రిషలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసిన వారందరికీ ఫ్యాన్స్ ఇచ్చిపడేస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందని, ఇదే విజయ్ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని కామెంట్స్ చేసిన వారందరినీ టార్గెట్ చూస్తూ.. ఏం ప్రభావం చూపించిందో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా వారి మధ్య ఏదైనా ఉండి ఉంటే, చట్టప్రకారం భార్యకు విడాకులు ఇచ్చే విజయ్ ముందుకు వెళతారని ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఇది ఊహించని పరిణామం అనే చెప్పాలి. విజయ్ విజయంపై త్రిష మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందులోనూ ఆమె బర్త్‌డే రోజు, ఇప్పుడు అధికారమే రాబోతుండటంతో.. ఇప్పుడామె ఆనందానికి అవధులే ఉండవంటే అతిశయోక్తి కానే కాదు.
ఇవి కూడా చదవండి:
త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?