Trisha Krishnan: విజయ్ తో ఏమి లేనప్పుడు అంత సిగ్గెందుకు పడుతున్నావ్ పాప..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:29 PM
అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన త్రిష..
Trisha Krishnan: అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన త్రిష.. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. చాలా గ్యాప్ తరువాత త్రిష.. తెలుగులో విశ్వంభర సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. దీంతో పాటు తమిళ్ లో కూడా అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. అమ్మడు వివాదాల ద్వారా మరింత ఫేమస్ అయ్యింది.
గత కొంతకాలంగా త్రిష.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్స్, టూర్స్ అంటూ ఎక్కడో ఒకచోట కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి. విజయ్, త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ, ముద్దుగుమ్మ మాత్రం అదేమీ లేదని చెప్పుకొచ్చింది. కానీ, వీరి రిలేషన్ ఏంటి అనేది ఇప్పటివరకు బయటపడలేదు.
త్రిష పైకి చెప్పడం లేదు కానీ, కచ్చితంగా విజయ్ తో రిలేషన్ లో ఉందని మాత్రం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. తాజాగా సైమా అవార్డ్స్ లో త్రిష.. విజయ్ గురించి మాట్లాడింది. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకకు త్రిష కూడా హాజరయ్యింది. ఇక స్టేజీపై అమ్మడిని పిలిచి.. విజయ్ ఫోటో చూపించడం జరిగింది. విజయ్ ఫోటో చూడగానే ఫ్యాన్స్ అరవడం మొదలుపెట్టారు. ఇక వాళ్లు అరుస్తుంటే త్రిష సిగ్గుపడడం ఎన్నో అనుమానాలకు దారితీసింది.
ఇక ఈ ఈవెంట్ లో త్రిష.. విజయ్ గురించి మాట్లాడుతూ.. విజయ్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు. అతని కల ఏదైనా, అది నిజమవుతుంది ఎందుకంటే అతను దానికి అర్హుడు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం త్రిష చేసిన వ్యాఖ్యలు, ఆమె అలా సిగ్గుపడడం పై అభిమానులు మరోసారి విజయ్ తో పెళ్లి వార్తలు బయటకు తీశారు. అతనితో ఏమి లేనప్పుడు పేరు చెప్పగానే అంతా సిగ్గు పడడం దేనికి పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరి మద్య ఏం జరుగుతుంది అనేది ముందు ముందు తెలుస్తుందేమో చూడాలి.
Monday Tv Movies: సోమవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
Usaad Bhagat Singh: ఒకే ఫ్రేమ్ లో ఉస్తాద్ భామలు.. భలే ముద్దుగున్నారు