Trisha : త్రిషను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్దామనుకున్నా..
ABN , First Publish Date - 2023-11-20T00:52:08+05:30 IST
సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నా కెరీర్‌లో ఎన్నో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లోనూ త్రిషతో అలాంటి సీన్ ఉంటుందనుకొన్నా. ఆమెను బెడ్‌రూమ్‌లోకి...

మన్సూర్ అలీఖాన్ అసభ్య వ్యాఖ్యలు
సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నా కెరీర్‌లో ఎన్నో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లోనూ త్రిషతో అలాంటి సీన్ ఉంటుందనుకొన్నా. ఆమెను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్దామనుకున్నా. కానీ రేప్ సీన్ లేకపోవడం బాధించింద’’ంటూ ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ వ్యాఖ్యానించారు. వీటిపై త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మన్సూర్ కామెంట్స్‌ని తీవ్రంగా ఖండిస్తున్నా. తనతో స్ర్కీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇలాంటి వ్యక్తులతో నటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటా’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో ‘లియో’ బృందం మొత్తం త్రిషకు మద్దతు ప్రకటించింది. తమిళ చిత్రసీమ కూడా మన్సూర్ వ్యాఖ్యల్ని చాలా సీరియస్‌గా తీసుకొంది. ‘‘త్రిష అంటే నాకు అభిమానం. నేను సరదాగా మాట్లాడిన విషయాల్ని అందరూ ఇంత సీరియస్‌గా తీసుకొంటారనుకోలేదు’’ అంటూ మన్సూర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.