Suriya: తిరుచ్చెందూరు మురుగన్ సేవలో సూర్య.
ABN, Publish Date - Oct 29 , 2026 | 08:31 AM
తమిళ నటుడు సూర్య (Suriya) ఆధ్యాత్మిక బాట పట్టారు. తన కొత్త చిత్రం ‘సీన్’ (Scene) విడుదలకు ముందు తమిళనాడులోని ప్రసిద్ధ తిరుచ్చెందూరు సుబ్రహ్మణ్యస్వామి సేవలో పాల్గొన్నారు.
తమిళ నటుడు సూర్య (Suriya) ఆధ్యాత్మిక బాట పట్టారు. తన కొత్త చిత్రం ‘సీన్’ (Scene) విడుదలకు ముందు తమిళనాడులోని ప్రసిద్ధ తిరుచ్చెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారి సేవలో పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుమారు 5 గంటలకు తిరుచ్చెందూరు ఆలయానికి చేరుకున్న సూర్యకు ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సూర్య ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపించారు. సూర్య నటించిన కొత్త చిత్రం ‘సీన్’ దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో జ్యోతిక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నజ్రియా నజిమ్ కథానాయిక.
ALSO READ:
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత
‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే
‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే