‘టీచర్’గా సిమ్రాన్.. అనౌన్స్‌మెంట్ వీడియో అదిరింది
ABN , Publish Date - Apr 30 , 2026 | 09:39 PM
దశాబ్దాల కాలంగా తన నటనతో, అందంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన సీనియర్ నటి సిమ్రాన్.. ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించబోతున్నారు. ఆ అవతారానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్ అవుతోంది.
దశాబ్దాల కాలంగా తన నటనతో, అందంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన సీనియర్ నటి సిమ్రాన్ (Simran).. ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘టీచర్’ (Teacher). ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలు శర్మ (Balu Sharma) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్ టాకీస్ బ్యానర్లపై కాశీ విశ్వనాథన్, సమీర్ భరత్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ‘హిస్టరీ లెసన్స్ మరింత ఉత్కంఠభరితంగా మారబోతున్నాయి’ అంటూ.. మేకర్స్ విడుదల చేసిన ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. సిమ్రాన్ వంటి పవర్‌ఫుల్ నటి ఇలాంటి పాత్రలో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సాధారణంగా టీచర్ అంటే పాఠాలు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దడం చూస్తాం. కానీ ఈ సినిమాలో హిస్టరీ లెసన్స్ కాస్త ‘డార్క్’గా ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమా టైటిల్ లోగోలో చాక్‌పీస్‌తో పాటు గన్ (తుపాకీ) సింబల్ ఉండటం.. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నా.. సైకలాజికల్ డ్రామాగా ఈ మూవీ ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. మొత్తంగా చూస్తే.. చిన్న వీడియోతోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక టీజర్, ట్రైలర్ వంటి వాటిని ఇంకెంత వినూత్నంగా మేకర్స్ ప్లాన్ చేస్తారో.. అనే క్యూరియాసిటీని కూడా ఈ వీడియో కలగజేస్తోంది.
ఇక సిమ్రాన్ విషయానికి వస్తే.. టాప్ హీరోయిన్‌గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈ భామ.. పెళ్లి, పిల్లల అనంతరం మొదలెట్టిన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తగ్గేదేలే అనేలా దూసుకెళుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమెకు ప్రాధాన్యమున్న పాత్రలు పడుతుండటం విశేషమనే చెప్పుకోవాలి. అప్పుడు హీరోయిన్‌గానే.. ఇప్పుడు మాత్రం వైవిధ్యభరిత పాత్రలతో మరోసారి నటిగా తన సత్తా ఏంటో సిమ్రాన్ చాటుతున్నారు. ఈ ‘టీచర్’తో కూడా ఆమె బ్లాక్ బస్టర్ అందుకునేలానే ఉన్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?