Simran: గుర్తుపట్టలేనంతగా మారిన సిమ్రాన్..

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:45 PM

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ (Simran) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Simran

Simran: సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ (Simran) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు.. తమిళ్ లో కమల్ హాసన్ నుంచి విజయ్ వరకు.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరితో నటించి మెప్పించిన ఏకైక హీరోయిన్ సిమ్రాన్. అందం, అభినయం, గ్లామర్ కలబోసిన హీరోయిన్ గా సిమ్రాన్ కు ఒక పెద్ద రికార్డ్ నే ఉంది. ఎన్నో ఏళ్లు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఒక్క చేత్తో ఏలిన మహారాణి ఆమె.


ఇక 2003 లో దీపక్ భగ్గాను వివాహం చేసుకొని కొద్దిగా సినిమలకు గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్.. ఆ తరువాత తెలుగుకు దూరమైంది. తమిళ్, కన్నడ భాషలలో బిజీగా మారింది. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. రీఎంట్రీలో విలన్ గా , సపోర్టింగ్ రోల్స్ లో అదరగొడుతుంది. ఈ ఏడాది ఇండస్ట్రీని షేక్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో సిమ్రాన్ నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. అంతేనా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కూడా నటించి మెప్పించింది.


ఇక 49 ఏళ్ల వయస్సులో కూడా సిమ్రాన్ తన అందంతో అభిమానులను అలరిస్తుంది. అప్పుడు ఇప్పుడు అమ్మడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ అంతే నాజూకుగా ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే అంతకుముందు సిమ్రాన్.. తన న్యాచురల్ అందాన్ని కవర్ చేయడానికి హెయిర్ కు కలర్ వేసి.. మేకప్ తో కనిపించేది. అయితే గత కొన్నిరోజులుగా సిమ్రాన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తూ అలరిస్తుంది. వైట్ హెయిర్ తో కనిపించినా.. సిమ్రాన్ లో ఇంకా అందం పెరిగిందే తప్ప అస్సలు తగ్గలేదు. ప్రస్తుతం సిమ్రాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిమ్రాన్ ను చూసి చాలామంది.. ఏంటి సిమ్రాన్ ఇలా మారిపోయింది అని కామెంట్స్ చేతసున్నారు. ఇంకొంతమంది సిమ్రాన్ ఇలా ఉన్న కూడా చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Sneha Ullal: కరెంట్ సినిమా హీరోయిన్.. బికినీలో బెంబేలెత్తిస్తుందిగా

Jyathasya Maranam Druvam: జేడీ చ‌క్ర‌వ‌ర్తి.. జాత‌స్య మ‌ర‌ణం దృవం! టీజ‌ర్ అదిరింది

Updated Date - Sep 07 , 2025 | 06:45 PM