Simran: 47 ఏళ్ల వయసులోనూ దుమ్ము లేపుతోంది!

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:39 PM

డాన్స్ క్వీన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించింది.

Simran:  47 ఏళ్ల వయసులోనూ దుమ్ము లేపుతోంది!

డాన్స్ క్వీన్ సిమ్రాన్ (Simran) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించింది. 1997లో 'అబ్బాయిగారి పెళ్లి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో మెరిసి అగ్ర నాయికగా ఎదిగారు. అప్పట్లో సిమ్రాన్  డాన్స్, డ్రెసింగ్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఉండేది. 2008 వరకూ తెలుగులో వరుస చిత్రాలు చేసిన ఆమె ఆ తర్వాత తమిళ, హిందీ చిత్రాలకే పరిమితం అయింది. ఇతర భాషల్లో కీలక పాత్రలో కనిపిస్తుంది. కానీ తెలుగు సినిమాకు మాత్రం రీ ఎంట్రీ ఇవ్వలేదు, సోషల్‌ మీడియాలో మాత్రం హైపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో ఒకటి నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. వయసు 47 అయినా డాన్స్ లో  ఈజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

తాజాగా మహేష్‌ బాబు మాస్‌ సాంగ్‌కు  స్టెప్పులేసి అలరించింది. 'గుంటూరు కారం’లో కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు సిమ్రాన్‌ మాస్‌ స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె ఎనర్జీకి  ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సిమ్రాన్ లో డాన్సింగ్‌ ఈజ్‌ ఏమాత్రం తగ్గలేదని, 47 ఏళ్ల వయసులోనూ దుమ్ము దులిపేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

Simran.jpg

గతేడాది హిందీలో టైగర్‌-3 చిత్రంతో అలరించిందిన ఆమెకు ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాలున్నాయి. అయితే అందులో మూడు చిత్రాలు  'ధృవ నక్షత్రం', 'వనంగమూడి', 'అంధగన్' డిలే అయ్యాయి. 'శబ్ధం' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Updated Date - Mar 12 , 2024 | 01:39 PM