సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

41 ఏళ్లకే నటుడు మృతి.. విషాదంలో ఇండస్ట్రీ!

ABN, Publish Date - Apr 19 , 2026 | 06:12 PM

బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ (41), క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం (ఏప్రిల్ 18) కన్నుమూశారు. దీంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.

Siddharth Venugopal

బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ (41), క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం (ఏప్రిల్ 18) కన్నుమూశారు. దీంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మలయాళ టెలివిజన్ రంగానికి చెందిన సిద్ధార్థ్ వేణుగోపాల్ (Siddharth Venugopal) ఎన్నో పాపులర్ సీరియల్స్‌లో నటించారు. ‘కస్తూరిమాన్’, ‘భాగ్యజాతకం’ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువైన సిద్ధార్థ్ వేణుగోపాల్.. చిన్న వయసులోనే ఇలా కన్నుమూయడంతో, ఆయన అభిమానులు, పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న సిద్ధార్థ్ వేణుగోపాల్, ఆ వ్యాధిని జయిస్తాడని భావించామని, ఇంతలోనే ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నామంటూ సహనటులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్‌లు కంటతడి పెట్టిస్తున్నాయి.


ముఖ్యంగా నటి సీమ జీ నాయర్ పెట్టిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ.. ‘‘ఆశలన్నీ అడియాశలయ్యాయి.. సిద్ధార్థ్ ఇప్పుడు నొప్పి లేని ప్రపంచానికి వెళ్లిపోయాడు. గత రెండేళ్లుగా నీ కోసం నేను ఎంతో పోరాడాను. నా మనసు, శరీరం అలసిపోయినా సరే, నిన్ను బతికించుకోవాలని నిరంతరం పరిగెత్తాను.. కానీ ఈరోజు నీకు ఇక బాధ ఉండకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ్.. ఈ నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నా మనసు ముక్కలైపోతోంది’’ అని సీమ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరో నటుడు కిశోర్ సత్య చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఎవరీ సిద్ధార్థ్ సిద్ధార్థ్ వేణుగోపాల్ అంటే.. త్రిసూర్ జిల్లాలోని చాలకుడి (Chalakudy in Thrissur)కి చెందిన సిద్ధార్థ్, కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో షోలలో ప్రెజెంటర్‌గా పనిచేసి, ఆ తర్వాత నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు తల్లి, తమ్ముడు ఉన్నారు. ఆయన మరణం మలయాళీ ప్రేక్షకులకు తీరని లోటు అనే చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

Updated Date - Apr 19 , 2026 | 06:12 PM