సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sanchari: రైలు ప్రయాణం చుట్టూ సాగే విభిన్న కథ.

ABN, Publish Date - Oct 03 , 2026 | 09:29 AM

  దర్శకుడు రామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఏడు కడల్‌ ఏళు మలై’. (తెలుగులో ‘సంచారి: సప్త గిరులు సప్త సాగరాలు), నవీన్‌ పౌలి, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందించారు. 

 
దర్శకుడు రామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఏడు కడల్‌ ఏళు మలై’. (తెలుగులో ‘సంచారి: సప్త గిరులు సప్త సాగరాలు), నవీన్‌ పౌలి, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందించారు. సురేష్‌ కామాక్షి నిర్మించారు.  ఈ నెల ఒకటో తేదీన తమిళంలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ "పూర్తిగా విభిన్నమైన నేపథ్యంలో సాగే ఈ సినిమా రైలు ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రయాణంలో ముప్పై రెండేళ్ళ వ్యక్తిగా ‘మండాడి’ ఫేం సూరి నటించారు. నవీన్‌ పౌలి విచిత్రంగా చెప్పుకునే పాత్ర పోషించారు. సూరి, నవీన్‌ పౌలి పాత్రల మధ్య జరిగే ఊహించని పరిచయం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20 యేళ్ళుపూర్తి చేసుకున్న దర్శకుడు రామ్‌.. టేకింగ్‌, నూతన భావాలతో కూడిన కథనం ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఒక సరికొత్త లోకానికి తీసుకెళ్తుంది. వినోదాన్ని అందిస్తూనే, మానవ భావోద్వేగాల గురించి ఆలోచింపజేసే హృదయానికి హత్తుకునే చిత్రాలను తీయడంలో దర్శకుడు రామ్‌కు మంచి పేరుంది. ఆయన సినిమాలు సాధారణ పరిస్థితులకు కట్టుబడివుండవు. తాత్విక కోణంలో సాగుతాయి. ఈ చిత్రం కూడా అటువంటి పంథాలోనే సాగుతుంది. మానవత్వం గురించి చెప్పే ఒక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న దర్శకుడు చేసిన ఒక మంచి ప్రయత్నమే ఈ చిత్రకథ’ అని అన్నారు.   త్వరలో ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో సంచారి అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఆ టైటిల్ విషయంలో టాలీవుడ్ చిన్న వివాదం జరుగుతోంది. 

ఇవి కూడా చదవండి:

సమంతకు కోర్టులో ఊరట.. ఆ వీడియోలు డిలీట్ చేయాల్సిందే

రణబాలి పాత్ర వెనుక ఉన్న అసలు వీరులు వీళ్లే..

RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!

Updated Date - Oct 03 , 2026 | 12:27 PM