‘నువ్వు ఎప్పుడూ నా వైపే’.. త్రిషపై ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - May 25 , 2026 | 03:21 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’. ఈ సినిమా సక్సెస్‌ని పురస్కరించుకుని హీరోయిన్ త్రిషపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఆసక్తికరంగా పోస్ట్ చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ సినిమాలో కథానాయికగా నటించిన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)ను ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో త్రిష (Trisha)తో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
‘‘థ్యాంక్యూ సో మచ్ త్రిష.. నువ్వు అత్యంత కూలెస్ట్ స్టార్‌వి మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితురాలివి కూడా! ‘కరుప్పు’ (Karuppu) ఘన విజయం నీ ప్రెజన్స్‌తో మరింత స్పెషల్‌గా మారింది. నీలో నాకు నచ్చిన గొప్ప విషయం ఏమిటంటే.. నువ్వు ఎప్పుడూ నా వైపే ఉన్నావనే బలమైన నమ్మకాన్ని, ధైర్యాన్ని నాకు కలిగించావు’’ అంటూ ఆర్జే బాలాజీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దర్శకుడిగా తనకు త్రిష అందించిన సపోర్ట్ అంత గొప్పదని చెబుతూ ఆయన పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
సూర్య, త్రిషల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఒక అవినీతి న్యాయ వ్యవస్థను ఎదిరించి పోరాడే దేవుడు.. అనే స్థానిక దైవం కథాంశంతో సాగే ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించగా, త్రిష నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. సినిమా సాధించిన ఈ భారీ విజయంతో చిత్రయూనిట్ ఫుల్ జోష్‌లో ఉండడమే కాకుండా, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది: బాలకృష్ణ
10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?
జస్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చరణ్.. అసలు విషయమిదే!