Karuppu: జెర్సీ మూమెంట్ రీక్రియేట్ చేసిన డైరెక్టర్..

ABN , Publish Date - May 15 , 2026 | 03:05 PM

ఒక సినిమాని తెరకెక్కించాలి అంటే డబ్బు ఒక్కటే సరిపోదు. ఎంతోమంది కష్టం తోడవ్వాలి. ముఖ్యంగా సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. ఆ సినిమాను ఒక బేబీలా చూసుకుంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. ఆ బేబీ ప్రేక్షకులకు నచ్చితే డైరెక్టర్ గా అతను సక్సెస్ అయ్యినట్టే.

Karuppu

ఒక సినిమాని తెరకెక్కించాలి అంటే డబ్బు ఒక్కటే సరిపోదు. ఎంతోమంది కష్టం తోడవ్వాలి. ముఖ్యంగా సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. ఆ సినిమాను ఒక బేబీలా చూసుకుంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. ఆ బేబీ ప్రేక్షకులకు నచ్చితే డైరెక్టర్ గా అతను సక్సెస్ అయ్యినట్టే. అందరూ వచ్చి తన సినిమా బావుందని మెచ్చుకుంటుంటే అంతకు మించిన ఆనందం డైరెక్టర్ కి ఇంకేమి ఉండదు. ఆ క్షణం అతను పొందే ఆనందమే వేరు. తాజాగా ఆ ఆనందాన్ని అనుభవించాడు కోలీవుడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji).


నటుడిగా కెరీర్ ని ప్రారంభించిన ఆర్జే బాలాజీ డైరెక్టర్ గా పలు సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం కరుప్పు. సూర్య, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయ్యింది. అన్ని బావుండి ఉండుంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యేది. కానీ, కొన్ని కారణాల వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ మే 14 న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.


ఇక ఒక్కరోజులో రిలీజ్ ఉంది అనగా మేకర్స్ ఆర్థిక సమస్యల వలన సినిమా మే 14 న రిలీజ్ కాలేదు. అంతేకాకుండా గతంలో ఆర్జే బాలాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదంగా మారాయి. అలా పలు సమస్యల మధ్యలో సతమతమవుతూ మే 15 న కరుప్పు తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. సూర్య, త్రిష నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్ లో అభిమానులతో కలిసి త్రిష, కార్తీ, డైరెక్టర్ ఆర్జే బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కరుప్పు సినిమాను వీక్షించారు. సినిమా అయ్యాకా ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో డైరెక్టర్ బాలాజీ ఎమోషనల్ అయ్యాడు. జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ ని ఆయన రీ క్రియేట్ చేశాడు. గెలిచాను.. సాధించాను అంటూ ఎమోషనల్ గా అరుస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కష్టం మొత్తం మర్చిపోయే మూమెంట్, సక్సెస్ అంటే ఇదే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి తమిళ్ లో సక్సెస్ అందుకున్న సూర్య .. తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - May 15 , 2026 | 03:23 PM