సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Radhika: హృదయం బరువెక్కింది.. బాధను మాటల్లో చెప్పలేను..

ABN, Publish Date - Jun 11 , 2026 | 10:47 AM

తన గురువు, భారతీరాజా మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటి రాధిక శరత్‌కుమార్‌. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణించిన నేపథ్యంలో ఆయన్ను ఉద్వేశించి ఎక్స్‌ వేదికగా రాధిక ఎమోషనల్‌ పోస్టు చేశారు.

Radhik Sarathkumar

తన గురువు, దర్శకుడు  భారతీరాజా మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటి రాధిక శరత్‌కుమార్‌. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణించిన నేపథ్యంలో ఆయన్ను ఉద్వేశించి ఎక్స్‌ వేదికగా రాధిక ఎమోషనల్‌ పోస్టు చేశారు. ఆయనతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

‘నన్ను సగటు వ్యక్తిగా, నటిగా తీర్చిదిద్దిన వ్యక్తులు ఇద్దరు. నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నానన్నా కారణం వాళ్లిద్దరే. వారిలో ఒకరు నా మాతృమూర్తి.. మరొకరు నా గురువు భారతీరాజా. ఈ ఏడాదిలోనే నాకు ప్రియమైన ఇద్దరినీ కోల్పోయాను. ఈ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. నా హృదయం బరువెక్కింది. వారి జ్ఞాపకాలు, నాకు నేర్పిన జీవిత పాఠాలు నాతో ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటాయి. భారతీరాజా సర్‌.. మీరే నా సర్వస్వం.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ సమయంలో నా బాధను అర్థం చేసుకుని, నాతోపాటు నిలబడి, అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను’ అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.


అలాగే పలు సందర్భాల్లో భారతీరాజా గురించి ఆమె మాట్లాడిన వీడియోలను షేర్‌ చేశారు. ఇటీవల రాధిక భారతీరాజాను కలిశారు. ఆమె నటించిన ‘తాయ్‌ కిళవి’ సినిమా చక్కని విజయం సాధించిన నేపథ్యంలో తన గురువు ఆశీస్సులు తీసుకునేందుకు భారతీరాజా ఇంటికి వెళ్లారు. అంతకు కొద్ది రోజుల ముందే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. రాధికతో ముచ్చటించిన ఆయన ‘తాయ్‌ కిళవి’ చిత్రానికి నేషనల్‌ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. సంబంధిత ఫొటోలు షేర్‌ చేసి ‘నేషనల్‌ అవార్డు వస్తే మీ పాదాల దగ్గర పెడతాను’ అని రాధిక పోస్టులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!

బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..

Ravi Mohan: భార్య‌కు నెల‌కు రూ.40 ల‌క్ష‌ల భ‌ర‌ణం.. హీరో ర‌వి మోహ‌న్‌కు కోర్టులో చుక్కెదురు

Updated Date - Jun 11 , 2026 | 11:10 AM